Shiva Prajapati |
Updated on: May 24, 2021 | 6:50 PM
సైన్స్ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు.
ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ సృష్టించని అత్యంత చిన్న కృత్రిమ ‘గుండె’ను శాస్త్రవేత్తలు సృష్టించారు.
ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తల బృందం ఈ మినీ డుండెను అభివృద్ధి చేశారు.
25 రోజుల పిండం మాదిరిగా ఉన్న ఈ మినీ గుండె.. నువ్వుల విత్తన ఆకారంలో ఉంది.
ఈ మినీ గుండె సహాయంతో పిండస్థ దశలో గుండె జబ్బుల రహస్యం తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
12 సంవత్సారాల మా కృషి ఫలించిందని, ఈ మినీ హార్ట్ తయారు చేయడం కోసం మూడు నెలలుగా ల్యాబ్‌లోనే ఉన్నామని సైంటిస్ట్ డాక్టర్ సాషా మెండ్జన్ పేర్కొన్నారు.
దీని తయారీకి అయస్కాంత, ద్రవ లెవిటేషన్ పద్ధతులను ఉపయోగించామని, దీని వలన గుండె పని సామర్థ్యం పెరుగుతుందని మెండ్జన్ చెప్పుకొచ్చారు.