పిల్లలపై మూడో కోవిద్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండక పోవచ్చు, కేంద్రం స్పష్టీకరణ, కేసులు తగ్గుతున్న ఫలితంపై రీసెర్చర్ల విశ్లేషణ
సమీప భవిష్యత్తులో థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు ఉండవచ్చునని, ముఖ్యంగా ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపవచ్చునని వచ్చిన వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ వేవ్ వారిపై ప్రభావం చూపే...
సమీప భవిష్యత్తులో థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు ఉండవచ్చునని, ముఖ్యంగా ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపవచ్చునని వచ్చిన వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ వేవ్ వారిపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా తెలిపారు. తొలి కరోనా వైరస్ దశలో ఈ వేవ్ పెద్దలపైనా, ప్రస్తుతం ఈ రెండో దశలో యూత్ పైనా దీని ఎఫెక్ట్ కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఇక మూడో దశలో బాలలు దీనికి గురి కావచ్చునని మొదట్లో నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ ఇప్పుడా భయం లేదని ఆయన వివరించారు. నిజానికి ఇది వారికి ప్రమాదకరంగా పరిణమించవచ్చునని ఆందోళన తలెత్తిన మాట నిజమేనన్నారు. అటు ఇది వాస్తవాలపై ఆధారపడినది కాదని పీడియాట్రిక్స్ అసోసియేషన్ స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. కాగా- .ఒకవేళ బాలల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ అది స్వల్పంగా ఉంటుందని ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీ.కె. పాల్ వెల్లడించారు.మరణాల సంఖ్య సైతం చాలా తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇలా ఉండగా కోవిద్ కేసుల సంఖ్య తగ్గుతుండడంపై రీసెర్చర్లువిశ్లేషణ జరుపుతున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నందున చాలావరకు ఇవి అదుపులోకి వచ్చాయని, అలాగే ప్రజల్లో ఎక్కువమంది కోవిద్ నిబంధనలు పాటిస్తున్నారని వారు పేర్కొన్నారు.
మరోవైపు బ్లాక్, వైట్ ఫంగస్ పై పరిశోధకులు తమ అధ్యయనంపై దృష్టి పెట్టారు. కోవిద్ రోగి కోలుకున్న అనంతరం ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తోందని, బహుశా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన ఫలితమే ఇందుకు కారణమై ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. అటు ఎల్లో ఫంగస్ ను కూడా యూపీలోని ఓ రోగిలో కనుగొన్నట్టు వచ్చిన వార్తలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : Viral Video: ఈ కాకి ముక్కు ఎంత పదునో… చెట్టుకు ఎంత పెద్ద బొక్క పెట్టింది చూడండి… ( వీడియో ) Viral Video: డైవింగ్ నేర్పుతున్న డాల్ఫిన్… నెట్టింట వైరల్ గా మారిన వీడియో…