Heart Care: ప్రతిరోజూ పరగడుపున ఈ రెండు డ్రై ఫ్రూట్స్ తింటే.. గుండె జబ్బులను దూరం చేస్తాయి..
డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రైఫ్రూట్స్ చాలా ఖరీదైనప్పటికీ..వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకవిలువలున్నాయి. అందుకే డ్రైఫ్రూట్స్ తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తుంటారు. ప్రతిరోజూ పడిగడుపున ఈ రెండు రకాల డ్రైఫ్రూట్స్ తింటే గుండె జబ్బులు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Dry Fruits
డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రైఫ్రూట్స్ చాలా ఖరీదైనప్పటికీ..వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకవిలువలున్నాయి. అందుకే డ్రైఫ్రూట్స్ తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తుంటారు. ప్రతిరోజూ పడిగడుపున ఈ రెండు రకాల డ్రైఫ్రూట్స్ తింటే గుండె జబ్బులు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- గుండె సమస్యలు ఉన్నవారికి: డ్రై సీడ్స్ లేదా డ్రై ఫ్రూట్స్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చిన్న చిన్న వ్యాధులను నివారించడమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ముఖ్యంగా మూడు-నాలుగు నానబెట్టిన బాదం గింజలు, వాల్ నట్ గింజలను ప్రతిరోజూ తీసుకుంటే.. గుండెకు సంబంధించిన మూడు వంతుల సమస్యలు, శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలకు వీటి నుంచి పరిష్కారం లభిస్తుంది.
- గుండె ఆరోగ్యం విషయంలో..: మన చిన్న గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హృదయానికి అనుకూలమైన ఆహారాన్ని తినాలి. అలాగే, కొన్ని అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలికి దూరంగా ఉండాలి. హృదయానికి సహాయపడే అనేక ఆహారాలు ఉన్నాయి, కొన్ని ఆహారాలు ఖరీదైనవి అయితే కొన్ని ఆహారాలు సరసమైన ధరలలో లభిస్తాయి. అమినో యాసిడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా-లినోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉన్న ఆహారాలను మన ఆహారంలో వీలైనంత ఎక్కువగా చేర్చుకోవాలి. బాదం, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ దీనికి మంచి ఉదాహరణ.
- వాల్నట్ బాదం: వాల్‌నట్‌లు, బాదంపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
- గుండె ఆరోగ్యానికి వాల్‌నట్స్ : వాల్‌నట్ నోటి రుచిని పెంచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి మరింత అనుకూలమైన రీతిలో పనిచేస్తాయి. వాల్‌నట్ గింజల్లో వివిధ రకాల పోషకాలు, మినరల్స్, విటమిన్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల, వాల్‌నట్ ప్రతిరోజూ మితంగా తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతారు.
- నానబెట్టిన బాదం: బాదం గింజల్లో పోషకాల నిల్వ ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని రోజూ నీటిలో నానబెట్టి ఉదయం పూట మొదటి ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవడమే కాకుండా అనేక వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా, బాదంపప్పులో కరిగే ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం






