Non Veg Effects: మంచిదని నాన్ వెజ్ ఎక్కువగా తింటే.. షుగర్ రావడం ఖాయం!

చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అంటూ ఉంటారు. నిజంగానే వీరికి రోజూ ఏదో ఒక నాన్ వెజ్ ఐటెమ్ ఉండాలి. నాన్ వెజ్ తినడం మంచిదే. నాన్ వెజ్ చూస్తేనే నోరు ఊరుపోతూ ఉంటుంది. ఫంక్షన్స్‌కి వెళ్లారంటే ఓ పట్టు పడుతూ ఉంటారు నాన్ వెజ్ ప్రియులు. ఇప్పుడు నాన్ వెజ్‌లో ఎన్నో రకాల వంటకాలు వచ్చాయి. రెస్టారెంట్లు, హోటల్స్‌లో నోరు ఊరేలా వంటకాలను తయారు చేస్తున్నారు. నోటికి రుచిగా ఉంటున్నాయి కదా అని ఫుల్లుగా లాగించేస్తున్నారు. కానీ మరీ ఎక్కువగా..

Non Veg Effects: మంచిదని నాన్ వెజ్ ఎక్కువగా తింటే.. షుగర్ రావడం ఖాయం!
Non Veg Effects
Follow us

|

Updated on: Oct 04, 2024 | 3:30 PM

చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అంటూ ఉంటారు. నిజంగానే వీరికి రోజూ ఏదో ఒక నాన్ వెజ్ ఐటెమ్ ఉండాలి. నాన్ వెజ్ తినడం మంచిదే. నాన్ వెజ్ చూస్తేనే నోరు ఊరుపోతూ ఉంటుంది. ఫంక్షన్స్‌కి వెళ్లారంటే ఓ పట్టు పడుతూ ఉంటారు నాన్ వెజ్ ప్రియులు. ఇప్పుడు నాన్ వెజ్‌లో ఎన్నో రకాల వంటకాలు వచ్చాయి. రెస్టారెంట్లు, హోటల్స్‌లో నోరు ఊరేలా వంటకాలను తయారు చేస్తున్నారు. నోటికి రుచిగా ఉంటున్నాయి కదా అని ఫుల్లుగా లాగించేస్తున్నారు. కానీ మరీ ఎక్కువగా తింటే మాత్రం అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తినడానికి కమ్మగా ఉన్నా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొద్ది రోజుల్లోనే షెడ్డుకు వెళ్లిపోవాడం ఖాయం.

ఒక్కసారి వచ్చిందంటే పోనే పోదు..

నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్, అధిక బరువు, ఊబకాయం, చర్మ, జుట్టు వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సిందే. ముఖ్యంగా షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎటాక్ చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డయాబెటీస్ బారిన పడుతున్నారు. మధుమేహం అన్నది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఒక్కసారి వచ్చిందంటే.. కంట్రోల్ చేసుకోవడమే తప్ప. తగ్గడం అంటూ ఉండదు. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మధుమేహం బారిన పడుతున్నారని ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో తేలింది.

15 శాతం వచ్చే ఛాన్స్..

నైరుతి ఆసియా సహా ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో 19 లక్షలకు పైగా అధిక వయస్సు ఉన్న వ్యక్తిన్ని అధ్యయనం చేసినప్పుడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వారిలో టైప్ – 2 డయాబెటీస్ ముప్పు అధికంగా ఉందని తేలింది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజుకు 50 గ్రాముల ప్రోసెస్డ్ మీట్, 100 గ్రాముల అన్ ప్రోసెస్డ్ మీట్, 100 గ్రాముల పౌల్ట్రీ మీట్ తినే వారిలో దాదాపు 15 శాతం టైప్ – 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయని తేలింది. కాబట్టి ఇక నుంచైనా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని అయినా మితంగా తీసుకుంటేనే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..