Haircare Tips: బియ్యం కడిగిన నీళ్లతో ఇలా చేస్తే …మీ జుట్టుకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..!!
ఆధునిక యుగంలో మనిషి ఆరోగ్యాని కంటే అందానికే ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు. హెయిర్‌ప్యాక్‌లు, క్రీమ్‌లు,హెయిల్ ఆయిల్ ఇవన్నీ వాడి ఉన్న జుట్టు అందాన్ని కాస్త పాడుచేసుకుంటున్నారు.
ఆధునిక యుగంలో చాలా మంది తమ ఆరోగ్యం కంటే అందానికే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. హెయిర్‌ప్యాక్‌లు, క్రీమ్‌లు,హెయిల్ ఆయిల్ ఇవన్నీ వాడి ఉన్న జుట్టు అందాన్ని కాస్త పాడుచేసుకుంటున్నారు. ఆస్తులు పోయినా బాధపడరు కానీ…జుట్టు ఊడుతే మాత్రం ఎంతగా బాధపడతారో మాటల్లో చెప్పలేం. మనిషి అందానికి జుట్టు కూడా ముఖ్యమే. కానీ నేటికాలంలో కాలుష్యం, జీవనశైలి కారణంగా జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోతుంటే అమ్మాయిలైతే అస్సలు తట్టుకోలేరు. వారి అందాన్ని రెట్టింపు చేసేది కేశాలే. అందుకే జుట్టు మీదు అధిక శ్రద్ధ పెడతారు. అలాంటి జుట్టు పొడుగ్గా,మృదువుగా పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అందులో బియ్యం కడిగిన నీళ్లు లేదా గంజి చాలా ఉపయోగపడతాయి. దాంతో జుట్టును పదిలపర్చుకోవచ్చు.
బియ్యం కడిగిన నీటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు,యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు సంరక్షణ ఉపయోగపడతాయి. అంతేకాదు అన్నం ఉడికిన తర్వాత గంజిని వంపేస్తారు. ఆ వంపిన గంజీలో కూడా అనేక పోషకవిలువలు ఉంటాయి. అందుకే మన పెద్దలు చాలా మంది గంజి తాగి బతికేవారు. కానీ రానురాను ఆ గంజి వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు గంజిని షాంపూ,బట్టలకు కండీషనర్‌గా వాడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయితే బియ్యం నీళ్లను జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.
1. జుట్టును బలంగా చేస్తుంది:
బియ్యం నీళ్లలో ఇనోసిటాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది దెబ్బతిన్న వెంట్రుకల లోపలికి చొచ్చుకుపోయి వాటిని రిపేర్ చేస్తుంది. అంతేకాదు మీ జుట్టును భవిష్యత్తులో డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇందులో జుట్టు పునరుత్పత్తికి సహాయపడే అమైనో ఆమ్లాలను ఉన్నాయి. అవి జుట్టును బలంగా చేస్తాయి.
2. చిక్కులుగా ఉండే జుట్టు కోసం:
నిర్జీవంగా మారిన జుట్టు చిక్కులు చిక్కులుగా ఉంటుంది. దీంతో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. చిక్కులుగా మారిన జుట్టును దువ్వడం కష్టంగా మారుతుంది. బియ్యం కడిగిన నీళ్లు నిర్జీవంగా ఉన్న జుట్టుకు ఎంతో సహాయపడుతుంది. బియ్యం నీరు జుట్టులో ఉండే ఇనోసిటాన్ అనే పలుచని పొరతో పూత వస్తుంది. ఇది డ్యామేజ్ అయిన వెంట్రకలను రక్షించడంలో సహాయపడుతుంది. జుట్టు చిక్కుల్లు పడకుండా కాపాడుతుంది.
3. జుట్టును మృదువుగా మార్చుతుంది:
బియ్యం నీటిలో ప్రొటీన్ కంటెంట్ దెబ్బతిన్న జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టును మరింత మృదువుగా మార్చుతుంది. జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. బియ్యం నీటిలో ఉండే ఇనో సిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. అదనంగా బియ్యంలోని ప్రొటీన్లు మీ జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.
4. పొడవాటి జుట్టు:
బియ్యం నీళ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగదలకు తోడ్పడతాయి. అమైన్లో అమ్లాలు జుట్టు పునరుత్పత్తికి సహాయపడతాయి.
బియ్యం నీరు తయారు చేసే విధానం:
జుట్టుకు ఉపయోగించే బియ్యం నీరు తయారు చేసేందుకు ముందుగా రైస్ కుక్కర్ అన్నం ఉడికించాలి. ఉడికిన తర్వాత నీటిని వడగట్టాలి. ఈ నీళ్లు చల్లారిన తర్వాత అందులో కొన్ని రకాల నూనెలు వేసి…మీ జుట్టుకు పట్టించాలి. దీనితోపాటుగా బియ్యం కడిగేనప్పుడు వచ్చే నీళ్లను కూడా జుట్టుకు ఉపయోగించవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)