AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్ విడాకులకు దారి తీస్తుందా.. నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మారిపోతున్న పరిస్థితుల కారణంగా ఒకే బిడ్డను కనేందుకు దంపతులు ఆసక్తి చూపిస్తున్నారు. వారికి ద బెస్ట్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకే బిడ్డను పెంచడం కొన్నిసార్లు సవాలుగా..

Parenting Tips: సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్ విడాకులకు దారి తీస్తుందా.. నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Single Child Concept
Ganesh Mudavath
|

Updated on: Feb 21, 2023 | 12:41 PM

Share

మారిపోతున్న పరిస్థితుల కారణంగా ఒకే బిడ్డను కనేందుకు దంపతులు ఆసక్తి చూపిస్తున్నారు. వారికి ద బెస్ట్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకే బిడ్డను పెంచడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది. ఇద్దరు పిల్లలను పెంచడం కంటే ఒక పిల్లాడిని పెంచడం చాలా కష్టం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లాడు ఒంటరిగా ఉంటాడని భయపడుతుంటారు. కుటుంబ నియంత్రణ కారణంగా ప్రస్తుతం చాలా మంది సింగిల్ చైల్డ్ ను కలిగి ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే సంతానం ఉన్నప్పుడు.. వారి ఎడ్యుకేషన్ పై సరిగ్గా దృష్టి పెట్టవచ్చు. అమెరికన్ సోషియోలాజికల్ రివ్యూ అధ్యయనం ప్రకారం తోబుట్టువులు కలిగి ఉన్న వారి గ్రేడ్‌లు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ పరిమాణం పెరిగే కొద్దీ.. పేరెంట్స్ ప్రతి పిల్లవాడితో చదువు గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్‌లోని శాస్త్రవేత్తలు.. తోబుట్టువుల పోటీ పిల్లలను అసంతృప్తికి గురిచేస్తుందని కనుగొన్నారు.

తరచుగా తో బుట్టువులతో ఉన్న పిల్లలు వారి సోదరుడు లేదా సోదరి నుంచి బెదిరింపులకు గురవుతారని అధ్యయనం వెల్లడించింది. ఒకే సంతానం ఉన్నవారి జీవితం భవిష్యత్తులో సంతోషకరమైన వివాహాన్ని కష్టతరం చేస్తుంది. దీంతో విడాకులు తీసుకునే పరిస్థితి అధికంగా ఉంటుందని తెలిపింది. తోబుట్టువులను కలిగి ఉండటం విడాకుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తోబుట్టువులను కలిగి ఉండటం వలన కౌమారదశలో ఉన్నవారు స్వీయ-స్పృహ, భయం, ఒంటరి అపరాధ భావన నుంచి సురక్షితంగా ఉంటుంది.

సామాజికంగా, భావోద్వేగంగా మానసిక అభివృద్ధి అలవడుతుంది. నేర్చుకోవడం, సంబంధాలను ఏర్పరచుకోవడం, కమ్యూనికేట్ చేయడం వంటివి వారి మానసిక సంబంధాలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు ఏది చూసినా జీవితాంతం వారితోనే ఉండే అవకాశం ఉంటుంది. వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల చర్యలు, చికిత్స ద్వారా ప్రపంచంలో విషయాలను తెలుసుకుంటారు. మొదటి మూడేళ్లలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు కాబట్ట ఆ సమయంలో వారితో వ్యవహరించే తీరు వారి మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి