AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: పళ్లు పీకి.. సూదులతో గుచ్చి 7ఏళ్ల బాలుడిని హత్య చేసిన దుండగులు.. ఎక్కడంటే?

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన 7 ఏళ్ల చిన్నారిని క్షుద్రపూజల నెపంతో దారుణంగా హత్య చేశారు. నిజానికి ఆ చిన్నారిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు భావిస్తున్నారు.

Crime: పళ్లు పీకి.. సూదులతో గుచ్చి 7ఏళ్ల బాలుడిని హత్య చేసిన దుండగులు.. ఎక్కడంటే?
Crime News
Venkata Chari
|

Updated on: Feb 21, 2023 | 5:46 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన 7 ఏళ్ల చిన్నారిని క్షుద్రపూజల నెపంతో దారుణంగా హత్య చేశారు. నిజానికి ఆ చిన్నారిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం పోలీసులు గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ విషయం కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్వైశ్యాపూర్ గ్రామానికి సంబంధించినది. జహాన్‌లో నివసిస్తున్న 7 ఏళ్ల ఉత్తమ్ శనివారం అదృశ్యమయ్యాడు. తొలుత కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లినట్లు భావించారు. దీంతో గ్రామస్థులు, బంధువులు రాత్రంతా చిన్నారి కోసం వెతికారు. కానీ, అతని ఆచూకీ తెలియలేదు. చిన్నారి కనిపించకపోవడంతో బంధువులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించారు.

గోధుమ పంట పొలాల్లో మృతదేహం లభ్యం..

కాగా, ఆదివారం సాయంత్రం గ్రామానికి దూరంగా ఉన్న గోధుమ పంట పొలాల్లో చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అక్కడ చిన్నారి పళ్లు విరిగిపోయి, సూదిలాంటి పదునైన వస్తువు శరీరంలో గుచ్చుకున్నట్లు గమనించారు. ఆ చిన్నారి చెప్పుల్లో ఒకటి శ్మశాన వాటికలో, మరొకటి ఆలయంలో పడి ఉన్నాయి. మూఢనమ్మకాలతో క్షుద్రపూజలు చేసి బలి ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..

ఈ సందర్భంగా షాజహాన్‌పూర్ ఎస్‌ఎస్పీ ఎస్ ఆనంద్ సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించినట్లు తెలిపారు. అయితే, క్షుద్రపూజల వల్ల చిన్నారి హత్యకు గురయ్యే అవకాశం లేకపోలేదని, ప్రస్తుతం కేసు దర్యాప్తును కాంత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జైశంకర్ సింగ్‌కు అప్పగించామని అన్నారు. మరోవైపు గుర్తు తెలియని నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దీంతో పాటు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.