Andhra Pradesh: విద్యుత్ కంచెకు తగిలి పెద్దపులి మృతి.. వండుకుని తినేసిన గ్రామస్థులు.. ఫారెస్ట్ ఆఫీసర్ల రియాక్షన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ ప్రాంతంలో విద్యుత్ కంచెకు తగిని మృతి చెందిన పులిని.. కొందరు వండుకుని తిన్నారన్న వార్తలు సంచలనం కలిగించాయి. అయితే అవన్నీ వదంతులేనని..

Andhra Pradesh: విద్యుత్ కంచెకు తగిలి పెద్దపులి మృతి.. వండుకుని తినేసిన గ్రామస్థులు.. ఫారెస్ట్ ఆఫీసర్ల రియాక్షన్ ఇదే..
Tiger
Follow us

|

Updated on: Feb 21, 2023 | 7:14 AM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ ప్రాంతంలో విద్యుత్ కంచెకు తగిని మృతి చెందిన పులిని.. కొందరు వండుకుని తిన్నారన్న వార్తలు సంచలనం కలిగించాయి. అయితే అవన్నీ వదంతులేనని యర్రగొండపాలెం అటవీ క్షేత్రాధికారులు తెలిపారు. అక్కపాలెం సమీపంలోని అడవిలోని నీటి కుంట వద్దకు పది రోజుల క్రితం మూడు పులులు వచ్చి వెళ్లినట్టు గుర్తించామన్నారు. దీంతో చుట్టు పక్కల రైతులను అప్రమత్తం చేశామన్నారు. పులిని వండుకుని తిన్నారన్న వార్తలపై అన్ని కోణాల్లోనూ విచారణ చేశామన్నారు. వారి ఇళ్లల్లోనూ సోదాలు చేశామని, ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని వివరించారు. అయితే.. ఈ ప్రాంతంలో పులులు ఉన్నాయని అధికారులు ప్రకటించడంతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభించలేదు. దీంతో అసలు పులులున్నాయా లేదా.. ఉంటే ఏమయ్యాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి చనిపోయింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పులి మాంసాన్ని వండుకుని తినేశారు. పులి గోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య విబేధాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..