Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహ రోగులకు అలర్ట్.. రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా అదుపు చేసే దివ్య పత్రాలు ఇవిగో!

అంజీర్ పండ్లు రుచిగా ఉండటమేకాకుండా బోలెడన్ని పోషక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. కానీ అంజూర చెట్టు ఆకులు గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అంజీర్‌ అకులు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకులు మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.అంజీర్ ఆకులు ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహ రోగులకు అలర్ట్.. రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా అదుపు చేసే దివ్య పత్రాలు ఇవిగో!
Anjeer Leaf
Srilakshmi C
|

Updated on: Jul 05, 2025 | 6:03 AM

Share

మన చుట్టూ అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేసే చెట్లు మొక్కలు చాలానే ఉంటాయి. కానీ సహజంగా లభించే ఈ విధమైన మొక్కలను మనం పెద్దగా పట్టించుకోం. అంజీర్ కూడా ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి. అంజీర్ పండ్లు రుచిగా ఉండటమేకాకుండా బోలెడన్ని పోషక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. కానీ అంజూర చెట్టు ఆకులు గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అంజీర్‌ అకులు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకులు మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.అంజీర్ ఆకులు ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..

అంజీర్ ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇది మధుమేహం ఉన్నవారికి సహజ నివారిణి. అధిక చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అంజీర్ ఆకులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అంజీర్ ఆకులను క్రమం తప్పకుండా తింటే మధుమేహం ఉన్నవారు వారి ఇన్సులిన్ అవసరాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. అంతే కాదు అంజీర్ ఆకులు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షణ కల్పిస్తాయి.

డయాబెటిస్ నిరోధక లక్షణాలతో పాటు, అంజూర ఆకుల్లో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తాయి. మూత్ర నాళం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి అల్సర్ల లక్షణాలను తగ్గించడానికి, రక్తంలో ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అంతేకాకుండా, అంజీర్ ఆకుల రసం దాని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌ల కారణంగా మొటిమలను తొలగించే సామర్థ్యానికి కలిగి ఉంటుంది. అందువల్ల, దీనిని స్థానికంగా సహజ ప్రత్యామ్నాయంగా మన పూర్వికుల కాలం నుంచి వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా అంజీర్ ఆకులు తీసుకోవడం సురక్షితమే అయినప్పటికీ, డయాబెటిస్‌కు ఇప్పటికే మందులు లేదా ఇన్సులిన్ తీసుకుంటున్న వ్యక్తులు ఈ ఆకుతో తయారు చేసిన టీని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. ఈ ఆకు టీ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, ఇది అందరిపై ఒకే విధమైన ప్రభావాలను చూపదు. కాబట్టి తొలుత వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు తీసుకోవడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.