Onions for Face: పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయతో అన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లిపాయతో ఒకటేంటి చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కేవలం ఆరోగ్య సమస్యలు, జుట్టు సమస్యలే కాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. చాలా మందికి ముఖంపై తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో మన ముఖం మనం చూసుకోవాలన్నా..
తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయతో అన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లిపాయతో ఒకటేంటి చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కేవలం ఆరోగ్య సమస్యలు, జుట్టు సమస్యలే కాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. చాలా మందికి ముఖంపై తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో మన ముఖం మనం చూసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇవి ముఖ అందాన్ని తగ్గిస్తాయి. వీటిని మేకప్‌తో కవర్ చేసుకోవడం కూడా కష్టమే. దీంతో చాలా మంది బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతారు. మార్కెట్లో ఉండే క్రీమ్స్‌ని ఉపయోగిస్తారు. అలా కాకుండా ఇంట్లోనే మనం ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ఉల్లిపాయ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఉల్లిపాయతో ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎలా ఉపయోగించాలంటే..
మచ్చలు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. దీన్ని కట్ చేసి.. మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టు నుంచి రసాన్ని బయటకు తీయండి. దీన్ని ఓ క్లాత్‌లో వేసి పిండితే రసం వచ్చేస్తుంది. ఈ రాసాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రతీ చోట రాయండి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి.
ఇలా ముఖానికి బాగా పట్టించి ఓ పావుగంట సేపు అలానే వదిలేయండి. ఆ తర్వాత సాధారణ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు ఉల్లి రసంతో చేయండి. ఇలా నెల రోజులు చేయగానే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మచ్చలు, మొటిమలు పోయి ముఖం మెరుస్తూ ఉంటుంది.
ఉల్లి రసంలో మీరు శనగ పిండి, పసుపు, పెరుగు వంటివి కూడా కలిపి ముఖానికి పట్టించవచ్చు. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేశారంటే పెద్దగా ఎలాంటి ఖర్చు ఉండదు. అయితే అన్నీ అందరికీ పడాలని లేదు కదా.. ముందు రెండు సార్లు ట్రై చేయండి. మీకు అలర్జీగా అనిపిస్తే వదిలి పెట్టండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..