AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Flour Purity: మార్కెట్లో నకిలీ గోధుమపిండి.. ఒరిజినలా? కదా? ఇలా ఇంట్లోనే చెక్‌ చేసుకోండి!

Wheat Flour Purity: గోధుమ పిండిని కూడా కల్తీ చేస్తున్నారు. పండుగల సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధారణ సమయంలోకంటే ఈ పండగల సమయంలో గోధుమ పిండి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా కల్తీ గోధుమపిండిని సరఫరా చేస్తున్నారు కొందరు..

Wheat Flour Purity: మార్కెట్లో నకిలీ గోధుమపిండి.. ఒరిజినలా? కదా? ఇలా ఇంట్లోనే చెక్‌ చేసుకోండి!
Subhash Goud
|

Updated on: Aug 06, 2025 | 11:43 AM

Share

ఈ రోజుల్లో మార్కెట్లో చాలా వస్తువులు కల్తీ రూపంలో తయారు అవుతున్నాయి. నకిలీ వస్తువులు కూడా ఒరిజినల్‌గా ఉండే విధంగా ఏ మాత్రం అనుమానం రాకుండా తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో కల్తీ అనేది ఒక సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏదో ఒక విధంగా మార్కెట్లో కల్తీదందా కొనసాగుతోంది. కల్తీమయాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు చేపడుతున్నారు. మార్కెట్లో కల్తీ పాలు, పెరుగు, నెయ్యి ఇలా రకరకాల ఆహార పదార్థాలతో పాటు ఇతర వస్తువులు సైతం కల్తీగా మార్చేస్తున్నారు. ఇక గోధుమ పిండిని కూడా కల్తీ చేస్తున్నారు. పండుగల సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధారణ సమయంలోకంటే ఈ పండగల సమయంలో గోధుమ పిండి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా కల్తీ గోధుమపిండిని సరఫరా చేస్తున్నారు కొందరు.

ఇది కూడా చదవండి: Aaquarium Fish: అక్వేరియంలో చేపలు త్వరగా చనిపోతున్నాయా? ఇలా చేస్తే ఎక్కువ కాలం బతుకుతాయి!

మనం వాడుతున్న గోధుమ పిండి నిజంగా స్వచ్ఛమైనదేనా? కాదా అని తెలుసుకోవడం కష్టమనిపించవచ్చు. కానీ కొన్ని ట్రిక్స్‌ ద్వారా మన ఇంట్లోనే చెక్‌ చేసుకోవచ్చు. కల్తీని తెలుసుకునేందుకు ఇప్పుడు ల్యాబ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన చిట్కాలతో ఇంట్లోనే గోధుమ పిండి స్వచ్ఛతను పరీక్షించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వాసన చూసి గుర్తించడం:

స్వచ్ఛమైన గోధుమ పిండికి ఒక తీపి, తాజాగా ఉండే సువాసన ఉంటుంది. ఇది అందరికి తెలిసిందే. దీనిలో ఏదైనా తేడా వస్తు అది కల్తీ అని గుర్తించవచ్చు. ఒకవేళ పిండి నుంచి పాత, ఘాటైన లేదా రసాయనాల వాసన వస్తే అది కల్తీ అయిందని అర్థం. కల్తీ పిండి వాసన సాధారణ పిండి వాసన కంటే భిన్నంగా ఉంటుంది. కానీ స్వచ్ఛమైన పిండి తాజాగా ఉంటుంది. పిండి వాసనలో తేడా ఉంటే అది కల్తీ జరిగినట్లే భావించాలి.

నీటితో పరీక్ష:

కల్తీ జరిగినట్లు నిర్ధారించాలంటే నీటితో కూడా పరీక్షించవచ్చు. ఈ పద్ధతి చాలా సులభ. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ గోధుమ పిండి వేయండి. ఒకవేళ పిండి నీటిలో బాగా కలిసి అడుగున చేరితే అది స్వచ్ఛమైనదని అర్థం. కానీ నీటి ఉపరితలంపై తేలుతున్నట్లు లేదా పలుచని పొర ఏర్పడినట్లు కనిపిస్తే అది ముమ్మాటికి కల్తీ జరిగినట్లే.

పేపర్ పరీక్ష:

గోధుమ పిండిని పేపర్‌ ద్వారా కూడా గుర్తించవచ్చు. ఒక తెల్లటి కాగితంపై కొద్దిగా పిండిని చల్లి, దాన్ని కాల్చాలి. అది కాలుతున్నప్పుడు తేలికపాటి మట్టి వాసన వస్తే అది స్వచ్ఛమైనదని అర్థం. లేదా అది కాలుతున్నప్పుడు ఏదైనా ఘాటైన లేదా రసాయన వాసన వస్తుందని అది కల్తీ పిండి అని అర్థం.

అరచేతిలో రుద్దడం ద్వారా..

స్వచ్ఛమైన గోధుమ పిండిని చేతి మధ్యలో రుద్దినప్పుడు అది మృదువుగా, జిగటగా అనిపిస్తుంది. కల్తీ పిండి అలా ఉండదు. రుద్దితే అది మైదా పిండిలా జారుతూ, లేదా జిగటగా అనిపిస్తుంది. గోధుమ పిండిలో ఊక (బ్రాన్) శాతం చాలా తక్కువగా ఉండి లేదా అస్సలు కనిపించకపోతే అది మైదాపిండితో కల్తీ చేసినట్లు అర్థం.

ఇది కూడా చదవండి: School Holidays: అతి భారీ వర్షాలు.. రెండు రోజులు పాఠశాలలు బంద్‌.. IMD హెచ్చరికతో విద్యాశాఖ కీలక నిర్ణయం

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి