గంటల్లో చేసే పని నిమిషాల్లో పూర్తి.. టీ స్ట్రైనర్ క్లీనింగ్ సింపుల్ టిప్స్ మీకోసం..!
టీ స్ట్రైనర్ ప్రతి ఇంట్లో ఉండే కిచెన్ టూల్. కానీ దాన్ని శుభ్రం చేయడం మాత్రం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. ఎంత కడిగినా టీ మరకలు తొందరగా పోవు. అయితే కొన్ని సులభమైన ట్రిక్స్ వాడితే టీ స్ట్రైనర్ ఎప్పుడూ కొత్తదానిలా మెరిసిపోతుంది.

Tea Strainer
కిచెన్ లో టీ స్ట్రైనర్ తప్పనిసరి. కానీ దాన్ని క్లీన్ చేయడం మాత్రం కొంచెం కష్టం. ఎన్నిసార్లు కడిగినా టీ మరకలు తొందరగా పోవు. అయితే కొన్ని ఈజీ ట్రిక్స్‌తో వాటిని శుభ్రం చేయవచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో.. అవి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
టీ స్ట్రైనర్ క్లీనింగ్ టిప్స్
- బేకింగ్ సోడా, వెనిగర్.. టీ స్ట్రైనర్‌పై గట్టిగా పేరుకుపోయిన మరకలను పోగొట్టడానికి బేకింగ్ సోడా, వెనిగర్ బెస్ట్ ఆప్షన్. ఒక గిన్నెలో రెండింటినీ సమానంగా వేసి స్ట్రైనర్ ను అందులో ఒక గంట నానబెట్టండి. తర్వాత తీసి నీటితో బాగా కడిగితే సరిపోతుంది.
- వేడి నీళ్లతో క్లీనింగ్.. స్ట్రైనర్‌పై వేడి నీళ్లు నెమ్మదిగా పోసి కడిగితే.. దానిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతాయి. గట్టిగా పట్టుకుపోయిన టీ మరకలు కూడా కరిగిపోతాయి. చివరగా స్క్రబ్ చేసి శుభ్రం చేస్తే స్ట్రైనర్ కొత్తదానిలా మెరుస్తుంది.
- నిమ్మరసం వాడకం.. నిమ్మకాయను సగం కట్ చేసి స్ట్రైనర్‌పై రుద్దితే మరకలు ఈజీగా పోతాయి. కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత నీటితో కడిగితే స్ట్రైనర్ ఇంకా శుభ్రంగా ఉంటుంది.
- బ్రష్, డిష్ సబ్బు.. స్ట్రైనర్‌ను గోరువెచ్చని సబ్బు నీటిలో కొద్దిసేపు నానబెట్టి చిన్న బ్రష్‌తో బాగా రుద్దండి. ఇలా చేస్తే చిన్న రంధ్రాల్లో కూడా పేరుకుపోయిన మురికి, మరకలు పోతాయి.
ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే మీ టీ స్ట్రైనర్ ఎప్పుడూ శుభ్రంగా కొత్తదానిలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి.




