Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Care Tips: వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. తులసి పచ్చగా పదికాలాలు ఉంటుంది..

వేసవి కాలం వచ్చిందంటే చాలు మనుషులు మాత్రమే కాదు.. పశువులు, పక్షులు, మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా తులసి మొక్కను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో తులసి మొక్క ఎండిపోతుంది. తులసి మొక్క విషయంలో ఎన్నో నమ్మకాలున్నాయి. కనుక తులసి మొక్క పచ్చగా ఉండాలని కోరుకుంటారు. తులసి మొక్క పెంపకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి మొక్కను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..

Tulsi Care Tips: వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. తులసి పచ్చగా పదికాలాలు ఉంటుంది..
Tulsi Summer Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2025 | 9:24 AM

తులసి మొక్కకు హిందువులకు అవినావభావ సంబంధం ఉంది. తులసి మొక్కకు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉండడమే కాదు అనేక ఔషధ గుణాలతో కూడా నిండి ఉంది. ఆయుర్వేదంలో తులసిని “మూలికల రాణి” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం వలన పర్యావరణం స్వచ్ఛంగా మారుతుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే వేసవి కాలంలో తులసి మొక్క చాలా సులభంగా ఎండిపోవడం ప్రారంభమవుతుంది. తీవ్రమైన సూర్యకాంతి, నీటి కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, తులసి దళాలు పసుపు రంగులోకి మారుతాయి. కొన్నిసార్లు మొక్క ఎండిపోవడం ప్రారంభమవుతుంది.

మొక్కను సరైన స్థలంలో ఉంచండి

తులసి మొక్కకి సూర్యరశ్మి అవసరం. అయితే వేసవిలో ఎక్కువ సూర్యరశ్మి పడితే మొక్కకు ఎండ హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో తులసి మొక్కను ఉదయం తేలికపాటి సూర్యకాంతి పడే విధంగా మాత్రమే కాదు.. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ నుంచి రక్షించబడే ప్రదేశంలో ఉంచండి. తులసి మొక్కను బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లయితే నీడ పడే ప్రదేశంలో లేదా ఆకు పచ్చ వల ఉపయోగించండి. మొక్కను బాల్కనీ లేదా కిటికీ దగ్గర ఉంచండి. అక్కడ తులసి మొక్కకు తేలికపాటి సూర్యకాంతి తగులుతుంది.. తాజా గాలిని లభిస్తుంది.

సరైన పరిమాణంలో నీరు ఇవ్వండి.

వేసవిలో తులసి మొక్కలకు ఎక్కువ నీరు అవసరం. అయితే అవసరం కంటే ఎక్కువ నీరు పోసినా తులసి మొక్క వేర్లు కుళ్ళిపోతాయి. ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు నీరు పెట్టండి. మధ్యాహ్నం నీరు పెట్టవద్దు. ఎందుకంటే వేడి నేలకి నీరు పెట్టడం వల్ల వేర్లకు నష్టం జరుగుతుంది. అంతేకాదు తులసి మొక్క ఉన్న మట్టిని తనిఖీ చేయండి. నేల పొడిగా అనిపిస్తేనే నీరు పోయండి. అంతేకాదు తులసి ఆకులపై నీరుని తేలికగా పిచికారీ చేయండి. ఇలా చేయండి వలన ఆకులు ఆకుపచ్చగా.. తాజాగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సరైన మట్టిని వాడండి.

తులసి మొక్క బాగా పెరగాలంటే సారవంతమైన నేల.. తేమగా ఉండే నేల అవసరం. కనుక ఆవు పేడ ఎరువు, సేంద్రియ ఎరువు, ఇసుకను కలిపి నేలను తేలికగా, సారవంతమైనదిగా చేసుకోండి. ప్రతి 15 రోజులకు ఒకసారి తులసి మొక్క ఉన్న కుండీలో ఎరువు వేయండి. తద్వారా మొక్కకు అవసరమైన పోషణ అందుతూనే ఉంటుంది. నేలలో తేమ ఉండే విధంగా మల్చ్ వేయండి.. అనే ఆకుల పొర లేదా పొడి గడ్డితో కప్పండి.

ఎండలో తులసి దళాలు తెంపవద్దు

వేసవిలో ఎండ వేడికి తులసి మొక్క బలంగా పచ్చదనంతో ఉండాలంటే.. తులసీ దళాలను ఎక్కువగా తెంపవద్దు. ఇలా చేస్తే.. తులసి మొక్క బలహీనంగా మారుతుంది. అవసరాన్ని బట్టి మాత్రమే తులసి దళాలను తీసుకోవాలి. కొత్త వచ్చిన లేత దళాలను కోసే బదులు.. ముదురు ఆకులను తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)