Lord Hanuman: మంగళవారం రోజున పొరపాటున ఈ వస్తువులను దానం చేయవద్దు.. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడు, కుజుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున చేసే దానాలతో గ్రహ దోషాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. ఈ రోజున ఎరుపు రంగు వస్తువులు, శనగ లడ్డులు, కొబ్బరికాయలు, తులసి దండలు దానం చేయడం శుభప్రదం. అయితే కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా దానంగా ఇవ్వకూడదు. డబ్బు, నల్లని బట్టలు, చీపుర్లు, సౌందర్య సాధనాలు, పదునైన వస్తువులను దానం చేయకూడదు. ఈ రోజు మంగళవారం చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం..

హిందూ మతంలో మంగళవారం రామ భక్త హనుమాన్ కు, కుజుడికి అంకితమైన రోజుగా పరిగణించబడుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం హనుమంతుడిని మంగళవారం పూజిస్తారు. ఉపవాసం కూడా పాటిస్తారు. మంగళవారం ఉపవాసం ఉండటం వల్ల ఆంజనేయస్వామి ఆశీస్సులు లభిస్తాయని అంటారు. అంతే కాదు ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు సొంతం అవుతాయి,
మంగళవారం నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అదే సమయంలో మంగళవారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం నిషేధించబడింది. ఈ రోజు మంగళవారం నాడు ఏమి దానం చేయాలో ? ఏమి చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
మంగళవారం నాడు ఏమి దానం చేయాలి?
- ఎరుపు రంగు దుస్తులు లేదా పువ్వులు
- శనగపిండి తో చేసిన లడ్డు
- కొబ్బరి కాయలు
- తులసి దండ
- ఎర్ర చందనం
- గోధుమలు
- బెల్లం
- బియ్యం
- నెయ్యి
మంగళవారం రోజున ఏమి దానం చేయకూడదంటే
- మంగళవారం నాడు డబ్బు దానం చేయకూడదు.
- మంగళవారం నల్లని వస్త్రాలను దానం చేయకూడదు.
- మంగళవారం చీపురు దానం చేయకూడదు.
- మంగళవారాల్లో పసుపు, కుంకుమ, గాజులు వంటి సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులను దానం చేయకూడదు.
- మంగళవారం రోజున కత్తెర, చాకు వంటి పదునైన వస్తువులను దానం చేయకూడదు.
- మంగళవారం నాడు మినుములు లేదా ఏదైనా నల్ల రంగు వస్తువును దానం చేయకూడదు.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ఈ వస్తువులను దానం చేయడం వలన ఆర్థిక నష్టం ఏర్పడుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








