Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖలతో శ్రీవారి దర్శనం ఎప్పుడంటే…? గుడ్‌ న్యూస్‌ చెప్పిన టిటిడి

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై టిటిడి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 14 న తెలంగాణ బిజెపి ఎంపీ రఘునందన్ రావు తిరుమలలో చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోవడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు మార్చి 24 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది. ఈ విధానం

ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖలతో   శ్రీవారి దర్శనం ఎప్పుడంటే...? గుడ్‌ న్యూస్‌ చెప్పిన టిటిడి
Tirumala
Follow us
Raju M P R

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 17, 2025 | 4:22 PM

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై టిటిడి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 14 న తెలంగాణ బిజెపి ఎంపీ రఘునందన్ రావు తిరుమలలో చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోవడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు మార్చి 24 నుండి అమలు చేయాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ, వారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. రూ 300 ల శ్రీవారి శీఘ్రదర్శనం ఏ రోజు కారోజు దర్శనం కల్పించనుంది.ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే ఆరు మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది.

ఇప్పటివరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఏపీ ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు లేఖలు తీసుకుని ఆదివారం దర్శనం చేసుకునేలా స్వీకరించబడతాయని పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించాక పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ప్రకటన చేసింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరుతోంది.

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!