Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..!

చాలా మంది కూరగాయలు కుళ్లకుండా ఫ్రిజ్‌లో పెట్టడం అలవాటు చేసుకుంటారు. కానీ అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు. కొన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచితే పోషకాలు తగ్గిపోవడమే కాకుండా రుచి, నాణ్యత మారిపోతుంది. ఇవాళ మనం ఫ్రిజ్‌లో ఉంచకూడని కూరగాయలు గురించి.. అలాగే వాటిని ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..!
Vegetables Storage In Fridge
Follow us
Prashanthi V

|

Updated on: Mar 18, 2025 | 11:22 AM

మనలో చాలా మందికి కూరగాయలు త్వరగా కుళ్లకుండా ఫ్రిజ్‌లో పెట్టడం అలవాటుగా మారిపోయింది. అయితే అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యకరం కాదు. కొన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచితే పోషకాలు తగ్గిపోవడంతో పాటు రుచి, నాణ్యత కూడా మారిపోతాయి. ఇప్పుడు మనం ఫ్రిజ్‌లో పెట్టకూడని కూరగాయల గురించి తెలుసుకుందాం.

టమోటా

చల్లటి వాతావరణంలో టమోటా కణ నిర్మాణం దెబ్బతింటుంది. రుచి తగ్గి నాణ్యత తగ్గిపోతుంది. అంతేకాక టమోటాలలోని సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు.

క్యారెట్

క్యారెట్‌లను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచితే అవి డీహైడ్రేట్ అవుతాయి. పై భాగంలో ఫంగస్ ఏర్పడి రుచి చేదుగా మారుతుంది. ఈ కారణంతో క్యారెట్‌లను చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉంచకూడదు.

వంకాయ

వంకాయలను చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉంచితే అవి నల్లగా మారి చేదుగా అనిపిస్తాయి. కణ నిర్మాణం దెబ్బతిని వంకాయల రుచి మారుతుంది. కాబట్టి వంకాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

దోసకాయ

దోసకాయలను ఫ్రిజ్‌లో ఉంచితే చల్లటి వాతావరణం కణాలను దెబ్బతీస్తుంది. ద్రవం లీక్ అవ్వడంతో దోసకాయలు ఆరోగ్యానికి హానికరం అవుతాయి.

ఆకుకూరలు

ఆకుపచ్చ ఆకుకూరలు ఫ్రిజ్‌లో చల్లగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉంచితే అవి త్వరగా వాడిపోతాయి. పైగా ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగడం కూడా జరిగి అవి ఆరోగ్యానికి హానికరం అవుతాయి.

బంగాళదుంప

బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలోని పిండి పదార్థం చక్కెరగా మారిపోతుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా బంగాళదుంపలను అధిక వేడిలో ఉడికిస్తే ‘అక్రిలామైడ్’ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్‌కు దారితీయొచ్చు. అందుకే బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెట్టకుండా గాలితో తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం మంచిది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో ఉంచితే వాటికి తేమ చేరి బూజు పట్టి దుర్వాసన వస్తుంది. అలాగే వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉల్లిపాయలను కోస్తే సల్ఫర్ విడుదల అవ్వడంతో జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

వెల్లుల్లి

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే వాటి నాణ్యత తగ్గిపోతుంది. అలాగే మొలకలు వస్తాయి. ఈ మార్పుల వల్ల రుచి కూడా తగ్గుతుంది. అంతేకాక నూనెలో వెల్లుల్లి వేసినప్పుడు బొటులిజం అనే బ్యాక్టీరియా పెరగొచ్చు. ఇది ఆరోగ్యానికి హానికరం.

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?
వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?
పన్ను ఆదా చేసే ఈ ఐదు పోస్టాఫీసు పథకాల గురించి మీకు తెలుసా..?
పన్ను ఆదా చేసే ఈ ఐదు పోస్టాఫీసు పథకాల గురించి మీకు తెలుసా..?
గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్..
గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్..
ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
ఈ చిత్రంలోని చెట్టు, స్త్రీ.. మీరు ఎలా ఉన్నారో చెప్పేస్తుంది..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
పెద్ద పులిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బంది.. కానీ అంతలోనే..
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
విదేశాల్లో చదువులు..చౌకైన వడ్డీతో విద్యా రుణాలు అందించే బ్యాంకులు
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
షుగర్ పేషెంట్స్‌ ఆహారంతిన్న తర్వాత ఈ యోగానాలు వేయండి మెడిసిన్ ఇదే
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..