AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drumstick Pickle: నోరూరించే మునగకాయల నిల్వ పచ్చడి.. ఇలా చేసుకొని తింటే తస్సాదియ్యా.. స్వర్గమే!

మామిడికాయ, నిమ్మకాయ ఊరగాయల మాదిరిగానే మునగకాయలతోనూ నిలువ పచ్చని పెట్టుకోవచ్చని మీకు తెలుసా? ఇది కూడా మిగతా ఉకగామల్లానే చాలా రుచిగా ఉంటుంది. మునగకాయ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక 'సూపర్ ఫుడ్'. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి ఈ మునగకాయ నిల్వ పచ్చడిని సింపుల్‌గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం.

Drumstick Pickle: నోరూరించే మునగకాయల నిల్వ పచ్చడి.. ఇలా చేసుకొని తింటే తస్సాదియ్యా.. స్వర్గమే!
Drumstick Pickle At Home Easy RecipeImage Credit source: Getty images
Anand T
|

Updated on: Apr 22, 2026 | 6:52 PM

Share

Drumstick Pickle at Home easy recipe: మనకు మార్కెల్‌లో అనేక రకాల ఉరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అందిరికీ తెలిసింది, చింతకాయ, నిమ్మకాయ, మామిడికాయ నిల్వ పచ్చడ్‌లు మాత్రమే. కానీ మీరు మునగకాయలతో కూడా ఊరగాయ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. మునగ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, ఒక సూపర్ ఫుడ్ కూడా. మనం సాధారణంగా సాంబార్ దీనిని ఉపయోగిస్తాము. కానీ మామిడి లేదా నిమ్మకాయ లాగే, అనేక ఔషధ గుణాలున్న మునగతో కూడా చాలా రుచికరమైన ఊరగాయ చేసుకోవచ్చు. ఇది జీర్ణక్రియకు సహాయపడి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగను ఊరగాయగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.

మునగకాయ నిల్వ పచ్చడికి కావాలసిన పదార్థాలు

  • మునగకాయలు: తగినన్ని
  • ఆవ పొడి: 3 టీస్పూన్లు
  • ఎర్ర కారం: 2 టీస్పూన్లు
  • పసుపు: 1/2 టీస్పూన్
  • మెంతులు: 1 టీస్పూన్
  • సోంపు: 1/2 టీస్పూన్
  • ఇంగువ: 2 చిటికెలు
  • వినేగర్: 1 టీస్పూన్
  • నూనె, ఉప్పు: తగినంత

మునగకాయ నిలువ పచ్చడి తయారీ విధానం

ఇవి కూడా చదవండి

మునగకాయ నిలువపచ్చడి తయారు చేసేందుకు ముందుగా మునగకాయ ముక్కలను నీళ్లలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించి, నీటిని వడకట్టాలి. తర్వాత ఒక గాజు పాత్రలో ఆవ పొడి, ఉప్పు, కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో మునగకాయ ముక్కలను వేసి 3 రోజుల పాటు మూత పెట్టి ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి కడిగి, 3-4 గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్‌ చేసి ఒక బాండీ తీసుకొని అందులో కాస్త నూనె వేడి చేయాలి. అందులో కాస్త ఇంగువ వేసి కలపాలి తర్వాత స్టవ్ ఆప్ చేసి నూనెను చల్లార్చుకోవాలి. అయితే నూనె కొంచెం చల్లారిన తర్వాత ఆవాలు, మెంతులు, పసుపు, ఇతర మసాలా పొడులను వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఎండబెట్టిన మునగకాయ ముక్కలు, వినేగర్, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కారం ముక్కలన్నింటికి పట్టేలా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మున్నకాయ నిలువ పచ్చని రెడీ అయినట్టే.

ఇది మర్చిపోకండి

అయితే మీరు తయారు చేసిన ఈ ఊరగాయను మళ్ళీ ఒక గాజు సీసాలో నింపి 2-3 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇది తినడానికి సిద్ధమవుతుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా ఈ మునగకాయ ఊరగాయ అద్భుతమైన రుచిని ఇస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us