ఖరీదైన ఫేస్ ప్యాక్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా ఈజీగా అందాన్ని పెంచుకోండి
Anand T
22 April 2026
instagram
అందంగా ఉండాలంటే కేవలం ఖరీదైన ఫేషియల్స్ మాత్రమే వాడాల్సిన అవసరం లేదు, ఇంట్లో దొరికే బియ్యప్పిండి పెరుగుతో కూడా ముఖాన్ని మెరిపించుకోవచ్చు
మెరిచే చర్మం
బియ్యప్పిండిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉండే పోషకాలు ఉంటాయి. ఇది బిగుతుగా మార్చడంలో, ముఖంపై ఉన్న మలినాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
స్కిన్ టైటనింగ్
అలాగే పెరుగులో కూడా చర్మ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచి, ముఖానికి గులాబీ రంగు మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది.
హైడ్రేషన్
పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి సహజమైన నిగారింపును ఇస్తుంది. దీని చర్మం మెరిసేలా కనిపిస్తుంది
ల్యాక్టిక్ యాసిడ్
కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఏం ఏం కావలని చూసుకుంటే.. 2 చెంచాల బియ్యప్పిండి, 2 చెంచాల పెరుగు, ఒక చెంచా గులాబీ నీరు ఉంటే సరిపోతుంది
కావలసిన పదార్థాలు
ఒక గిన్నెలో బియ్యప్పిండి, పెరుగు కలిపి, అందులో కాస్త రోజ్ వాటర్ వేసి ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి.
తయారీ విధానం
ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, ఈ ప్యాక్‌ను ముఖం, మెడకు సమానంగా అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత, కొంచెం తడి చేసుకుని వృత్తాకారంలో స్క్రబ్ చేస్తూ చల్లని నీటితో కడిగేయాలి.
అప్లై చేసే పద్ధతి
వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల కాలుష్యం వల్ల పోయిన ముఖ వర్చస్సు మళ్ళీ తిరిగి వస్తుంది.