AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC: ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ వేస్తున్నారా.? పొరపాటున ఈ విషయాలు మర్చిపోకండి..

వేసవిలో ఏసీ అవసరం అనివార్యం. అయితే ఏసీ పేలుళ్లు, ఇతర సమస్యల గురించి ఆందోళన పెరుగుతోంది. ఏసీని సురక్షితంగా, సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో, మెయింటెనెన్స్ టిప్స్, విద్యుత్ బిల్లు తగ్గించే మార్గాలు, సరైన ఉష్ణోగ్రత సెట్టింగ్‌లు వంటి కీలక సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందామా..

AC: ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ వేస్తున్నారా.? పొరపాటున ఈ విషయాలు మర్చిపోకండి..
Ac 1
Ravi Kiran
|

Updated on: Apr 22, 2026 | 7:05 PM

Share

వేసవి తాపం తట్టుకోలేక చాలామంది ఇళ్లలో ఏసీలను వాడుతున్నారు. అయితే, ఇటీవల ఏసీలు పేలుతున్నాయనే వార్తలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.. ప్రస్తుత ఇన్వర్టర్ ఏసీలలో ‘R32’ అనే గ్యాస్ ఉపయోగిస్తారు. ఇది మండే స్వభావం కలిగింది. ఏసీ వాడే ప్రతి ఇంట్లో సరైన ఎర్తింగ్ ఉండటం తప్పనిసరి. అలాగే, ఔట్‌డోర్ యూనిట్‌కు గాలి ధారాళంగా తగిలేలా చూసుకోవాలి. వెంటిలేషన్ సరిగా లేకపోతే కంప్రెషర్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు సంభవించవచ్చు.

గ్యాస్ ప్రెషర్ ఎప్పుడూ 130-140 PSI మధ్య ఉండేలా చూసుకోవడం సురక్షితం. చాలామంది రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తారు. కానీ, రిమోట్‌తో ఆఫ్ చేస్తే ఏసీ ‘స్టాండ్‌బై’ మోడ్‌లోనే ఉంటుంది, పవర్ అందుతూనే ఉంటుంది. కాబట్టి, పని పూర్తయ్యాక లేదా బయటకు వెళ్లేటప్పుడు మెయిన్ స్విచ్(MCB) ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇది హై వోల్టేజ్ సమస్యల నుంచి ఏసీని కాపాడుతుంది. ఏసీని 16-18 డిగ్రీల దగ్గర ఉంచితే కంప్రెషర్‌పై భారం పడి కరెంట్ బిల్లు భారీగా వస్తుంది. మానవ శరీరానికి 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత అనుకూలం. చిన్న పిల్లలు ఉన్న గదులలో 28°C – 29°C ఉంచడం శ్రేయస్కరం. విద్యుత్ ఆదా కావాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను స్వయంగా శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్లు శుభ్రంగా ఉంటే కూలింగ్ వేగంగా అందుతుంది. ఏసీని కనీసం ప్రతి 9 నెలలకు ఒకసారి లేదా సమ్మర్ ప్రారంభానికి ముందు సర్వీసింగ్ చేయించుకోవాలి. టెక్నీషియన్ వచ్చినప్పుడు గ్యాస్ ప్రెషర్ 130-140 PSI మధ్య ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. నిర్లక్ష్యం వీడి, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటే ఏసీ వల్ల ఎటువంటి ముప్పు ఉండదు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..

Follow Us
Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో
Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో
జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారు లక్షమందికి పైనే..వాళ్ల సీక్రెట్ ఇదే
జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారు లక్షమందికి పైనే..వాళ్ల సీక్రెట్ ఇదే
మీకు అబ్బాయి పుడితే ఏ రంగు దుప్పటి ఇస్తారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
మీకు అబ్బాయి పుడితే ఏ రంగు దుప్పటి ఇస్తారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
తీరానికి చేరువలో అర్నబ్ తుపాన్.. రెండు రోజులు చాలా జాగ్రత్త!
తీరానికి చేరువలో అర్నబ్ తుపాన్.. రెండు రోజులు చాలా జాగ్రత్త!
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?
ఫిట్‌గా ఉండాలంటే ఇవి మానేయండి.. యువతకు ధోనీ ఫిట్‌నెస్ సీక్రెట్స్.
ఫిట్‌గా ఉండాలంటే ఇవి మానేయండి.. యువతకు ధోనీ ఫిట్‌నెస్ సీక్రెట్స్.
మూడో టీ20కి ముందే టీమిండియాకు భారీ ముప్పు..
మూడో టీ20కి ముందే టీమిండియాకు భారీ ముప్పు..
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు.. తల్లిదండ్రుల మాటే వేదవాక్కు..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు.. తల్లిదండ్రుల మాటే వేదవాక్కు..!