AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ నెల 19వ తేదీన అకౌంట్లోకి డబ్బులు.. ఒక్కొక్కరికీ రూ.2 వేలు.. రేవంత్ సర్కార్ నుంచి అప్డేట్..

తెలంగాణలో కొత్తగా పించన్లు మంజూరై డబ్బుల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. డబ్బులు అందించేందుకు ముహూర్తం ఖారారు అయింది. ఇఫ్పటికే ఆర్ధిక శాఖ ఆమోదం తెలపడంతో పాటు అవసరమైన నిధులును విడదుల చేసింది. దీంతో ఇక అందించడమే తరువాయి. ఎప్పుడు అందించనున్నారంటే..

Telangana: ఈ నెల 19వ తేదీన అకౌంట్లోకి డబ్బులు.. ఒక్కొక్కరికీ రూ.2 వేలు.. రేవంత్ సర్కార్ నుంచి అప్డేట్..
Telangana Government
Venkatrao Lella
|

Updated on: Nov 16, 2026 | 10:12 PM

Share

తెలంగాణలో కొత్త పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా పెన్షన్లు పొందినవారు తమకు డబ్బులు ఎప్పుడెప్పుడు అందుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది. లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నవంబర్ 19వ తేదీన పింఛన్‌దారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం నిధులు జమ చేయాలని నిర్ణయించింది. దాదాపు 4.63 లక్షల మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 19వ తేదీన రెండు పథకాలను ప్రారంభిస్తోంది. ఇందిరమ్మ బీమా పథకం, ఇందిరమ్మ చీరలు అందించే కార్యక్రమం ప్రారంభించనుంది. సిద్దిపేటలో జరిగే కార్యక్రమంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా.. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అదే రోజు కొత్తగా పింఛన్లు మంజూరైనవారి అకౌంట్లలో సొమ్ము క్రెడిట్ చేయనున్నారు. గతంలో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు అందించేవారు. కానీ రేవంత్ సర్కార్ నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేసే కార్యక్రమం చేపట్టింది. దీని వల్ల వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ నెలా వేస్తున్నారు.

కొత్త లబ్దిదారులతో మొత్తం పింఛన్లు పొందేవారి సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికుల కేటగిరీలో దరఖాస్తులు స్వీకరించింది. లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా.. పరిశీలన అనంతరం వారిలో లబ్దిదారులను గుర్తించింది. వితంతు కేటగిరీ కింద 2,77,894 మంది, దివ్యాంగుల కేటగిరీ కింద 1,00,224 మంది అర్హత సాధించగా.. ఒంటరి మహిళలు 53,844 మంది, గీత కార్మికులు 27,444 మంది, చేనేత కార్మికులు 4451 మందిని లబ్దిదారులుగా గుర్తించారు. మొత్తం కలిసి 4,63,857 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఈ నెల నుంచి ప్రతీ నెలా పెన్షన్లు అందుకోనున్నారు. ప్రస్తుతం ప్రతీ నెలా రూ.2 వేలు అందిస్తున్నారు. ఇప్పటికే కొత్త లబ్దిదారులు నిధులు అందించేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. రానున్న రోజుల్లో దీనిని రూ.4 వేలకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.

Follow Us