AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హమ్మయ్యా.. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. తెలంగాణ ప్రజలు పండుగ చేసుకునేవార్త..

తెలంగాణలో ఇల్లు కట్టుకున్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. గతంలో వారి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం ష్యూరిటీ కింద తమ వద్ద ఉంచుకుంది. ప్రస్తుతం ఇవి ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉన్నాయి. వాటిని ఇప్పటివరకు వెనక్కి ఇవ్వకపోవడంతో లబ్దిదారులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వాటికి మోక్షం కలిగింది.

Telangana: హమ్మయ్యా.. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. తెలంగాణ ప్రజలు పండుగ చేసుకునేవార్త..
Telangana
Venkatrao Lella
|

Updated on: Nov 16, 2026 | 9:49 PM

Share

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేదా ఇతర గృహ నిర్మాణ పథకాల కింద ఇల్లు నిర్మించుకున్నవారికి రేవంత్ సర్కార్ సూపర్ న్యూస్ అందించింది. ఇల్లు నిర్మాణం కోసం తాకట్టు పెట్టిన పట్టాలు, పొజిషన్ సర్టిఫికేట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని లబ్దిదారులందరికీ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఈ విషయాన్ని తాజాగా గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులు తమ పట్టాలు తనాఖా పెట్టారు. అప్పుడు వాటన్నింటిని తిరిగి ఇచ్చేయనున్నట్లు ప్రకటన చేశారు.

ఉమ్మడిలో ఏపీలో పేదలకు ఇల్లు నిర్మించిన సమయంలో మూడు భాగాలుగా లబ్ది చేకూర్చారు. ప్రభుత్వం సబ్సిడీతో పాటు సొంత వాటా, బ్యాంక్ లోన్‌గా విభజించారు. బ్యాంకుల నుంచి లోన్ పొందేందుకు లబ్దిదారులు తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికేట్లను ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారు. లోన్ మొత్తం పూర్తయిన తర్వాత వీటిని తిరిగి ప్రభుత్వం అందిస్తుంది. అయితే రుణాలు చెల్లించినా సరే ఇప్పటివరకు లబ్దిదారులకు పట్టాలు తిరిగి అందించలేదు. దీంతో ఇవి తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఉండిపోయాయి. పరిపాలనాపరమైన కారణాలతో పాటు సమన్వయం లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. పట్టాలు లేకపోవడం వల్ల తమ ఇంటిపై పూర్తి హక్కులు పొందలేకపోతున్నారు. ఆర్ధికంగా నిధులు అవసరమైన సమయంలో ఇంటి ద్వారా ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని వెంటనే లబ్దిదారులకు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో లబ్దిదారులకు ఊరట కలగనుంది.

ఇళ్ల పట్టాలు, ఒరిజినల్ సర్టిఫికేట్ల అందటం వల్ల స్థలం, ఇంటిపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు పొందుతారు. ఆర్ధికంగా నిధులు అవసరమైనప్పుడు వీటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయిల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను తిరిగి అందించనున్నారు. ఈ మేరకు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా వీటి కోసం ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ లబ్దిదారులు తిరుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఇవి అందుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరుతుండటంతో ప్రజలు ఎగిరి గంతేస్తున్నారు. ఎట్టకేలకు తమకు ఇంటి పట్టాలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014 కంటే ముందు ష్యూరిటీ కోసం తనాఖా పెట్టిన పట్టాలన్నీ ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగొస్తున్నాయి.

Follow Us
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
మనీలా విందులో ఫిలిప్పీన్స్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన మోదీ
మనీలా విందులో ఫిలిప్పీన్స్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన మోదీ
గ్రాండ్‏గా తేజ సజ్జా నిశ్చితార్థం.. ఫోటోస్ ఇదిగో..
గ్రాండ్‏గా తేజ సజ్జా నిశ్చితార్థం.. ఫోటోస్ ఇదిగో..
భారత్ దాడి భయమా? ఐఎస్ఐ నీడలోకి హఫీజ్ సయీద్, మసూద్ అజర్!
భారత్ దాడి భయమా? ఐఎస్ఐ నీడలోకి హఫీజ్ సయీద్, మసూద్ అజర్!
త్రిపురాసురుడిని శివుడు ఎలా సంహరించాడు? దేవ దీపావళి వెనుక అసలు కథ
త్రిపురాసురుడిని శివుడు ఎలా సంహరించాడు? దేవ దీపావళి వెనుక అసలు కథ
నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన
నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన
జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర..
జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర..
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం