AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Yagam: 16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం కన్నుల పండువగా జరిగింది. కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. కల్యాణవేదిక వద్ద ఉన్న ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.

Raju M P R
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 9:10 PM

Share
ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తెలియక ఏవైనా దోషాలు జరిగి ఉంటే వాటి నివారణ కోసం బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే కార్తీక మాసంలో, శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. లోకకల్యాణార్థం 15వ శతాబ్దం నుంచే పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యలో నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుంచి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తోందని వివరించారు.

1 / 5
శ్రీవారి పుష్పయాగానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అర్చకులు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పయాగంలో 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగించారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నుల చొప్పున మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు.

2 / 5
మరోవైపు తిరుమలలో శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఎస్వీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ఆధునీకరణ పనుల పేరుతో మూసివేసిన ఈ మ్యూజియం పునఃప్రారంభం కావడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మ్యూజియంలో 8 వేలకు పైగా పురాతన కళాఖండాలు, డిజిటల్ ప్రదర్శనలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతకే కాకుండా అద్భుతమైన చరిత్రకు, అపురూపమైన శిల్పకళా సంపదకు నిలయమనే విషయాన్ని ఈ మ్యూజియం చాటిచెబుతోంది. సనాతన ధర్మ వైభవాన్ని భక్తులకు పరిచయం చేసేలా ఏడేళ్ల తర్వాత మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

3 / 5
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి విలువైన చారిత్రక సంపదను భక్తులకు పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా టీటీడీ మ్యూజియాన్ని పునఃప్రారంభించింది. అపురూపమైన శిల్పకళా సంపద, ఆభరణాలు, వాయిద్యాలు, ఆయుధాలు, పూజా సామగ్రి, ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాతన వస్తువులను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్వ రహస్యాలను పరిచయం చేసేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. రాతితో పాటు ఇతర లోహాలతో చెక్కిన శిల్పాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి దివ్యరూపం, ఆలయ చరిత్ర, భారతీయ శిల్పకళ, ఆలయ నిర్మాణ వైభవం, సంగీతం, నృత్యం, పూజా సంప్రదాయాలు, పురాతన ఆయుధాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ భక్తులకు మన సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వైభవాన్ని పరిచయం చేస్తున్నాయి.

4 / 5
మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మాండం గ్యాలరీ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత సెప్టెంబర్ 16న సీఎం చంద్రబాబు దాదాపు రూ.125 కోట్లతో ఆధునీకరించిన ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. విశ్వం, సృష్టి రహస్యాలను వివరిస్తున్న బ్రహ్మాండం గ్యాలరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డిజిటల్ విజువల్స్, ప్రత్యేక సౌండ్ సిస్టమ్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. మ్యూజియంలోని 14 ప్రత్యేక గ్యాలరీలు, 8 వేలకు పైగా పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు శ్రీవారి ఆలయ నిర్మాణ వైభవాన్ని చాటిచెబుతున్నాయి. మొత్తంగా ఆధ్యాత్మికత, చరిత్ర, శిల్పకళ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలగలిసిన ఎస్వీ మ్యూజియం తిరుమలకు వచ్చే భక్తులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది.

5 / 5
Follow Us