AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన.. వైరల్ అవుతున్న ఓటర్ నోట్!

ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏ పార్టీ వారు ఎన్ని డబ్బులు ఇస్తారు.. ఎవరికి ఓటేయాలి అని చూసే ఈ సమాజంలో ఓ వ్యక్తి మాత్రం తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఓటు వేసేందుకు తనకు ఇచ్చిన డబ్బులను బ్యాలేట్ బాక్స్‌లో వేసి.. నా ఓటుకు మీ నోటెందుకని.. తన ఓటును ఎప్పుడూ అమ్ముకోనని రాసుకొచ్చాడు. ఓట్ల లెక్కింపులో బయటపడిన ఆ ఓటర్ రాసిన నోట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన.. వైరల్ అవుతున్న ఓటర్ నోట్!
Honest Voter In Palamaner Rejects Cash For Vote With Note In Ballot Box
Raju M P R
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 9:33 PM

Share

నా ఓటు నోటుకు కాదు అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఓటరు తన నిజాయితీని చాటుకున్నాడు. ఎన్నికల్లో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులకు గట్టి గుణపాఠం చెబుతూ, పవిత్రమైన ఓటు విలువను ప్రజాస్వామ్య వ్యవస్థకు మరోసారి గుర్తుచేశాడు. బ్యాలెట్ బాక్స్‌లో డబ్బుతో పాటు ఓ చీటీ వేసి తన నిరసనను తెలిపిన ఆ ఓటరు తీరు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు రూరల్ పరిధిలోని మురం గ్రామంలో ఇటీవల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పలమనేరు డిగ్రీ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌ను తెరవగా, అందులో కనిపించిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ ఓటరు బ్యాలెట్ పేపర్‌తో పాటు రెండు రూ.500 నోట్లను, ఒక కాగితంపై రాసిన సందేశాన్ని బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు. అయ్యా.. మీరిచ్చిన డబ్బు రూ.1000 మీరే తీసుకోండి. నేను డబ్బు తీసుకుని ఓటు వేయను. ధన్యవాదాలు అని ఆ చీటీలో రాసి ఉంది. ఈ చీటీని, నోట్లను పరిశీలించిన పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోవడంతో పాటు, విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

ఓటుకు నోటును తిరస్కరించిన ఆ ఓటరు చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కొనియాడారు. నోట్లకు ఓటును తాకట్టు పెట్టని ఆ ఓటరు నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలపై అతనికున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చిన అభ్యర్థికి తగిన గుణపాఠం చెప్పినట్లయిందని తెలిపారు.

డబ్బు తీసుకుని ఓటేస్తే ఐదేళ్ల పాటు ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఆ ఓటరు చాటిచెప్పాడు. అభ్యర్థులు ఇచ్చే నోట్ల కంటే ఓటరు తెలివైన నిర్ణయమే గొప్పదని నిరూపించిన ఈ సాహసోపేత ఘటన ప్రతి ఓటరుకు కనువిప్పు కలిగించేలా ఉందని, ఓటర్లలో చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన
నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన
జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర..
జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర..
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం
అడవిలో పాతి పెట్టిన నోట్ల కట్టలు! హంగేరీలో కలకలం!
అడవిలో పాతి పెట్టిన నోట్ల కట్టలు! హంగేరీలో కలకలం!
ఉల్లిపాయలపై నల్లటి మచ్చల వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
ఉల్లిపాయలపై నల్లటి మచ్చల వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
ఈ తేదీల్లో పుట్టినవారి మాటతీరే ప్రత్యేకం.. ఒక్కసారి మాట్లాడితే..
ఈ తేదీల్లో పుట్టినవారి మాటతీరే ప్రత్యేకం.. ఒక్కసారి మాట్లాడితే..
పిల్లలు ఆడుకునే బొమ్మే కిల్లర్ గా మారితే.. OTTలో ఈ సినిమా చూశారా?
పిల్లలు ఆడుకునే బొమ్మే కిల్లర్ గా మారితే.. OTTలో ఈ సినిమా చూశారా?
ఆ ఒక్క సినిమాతో నా అప్పులన్నీ తీరిపోయాయి..
ఆ ఒక్క సినిమాతో నా అప్పులన్నీ తీరిపోయాయి..