AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్లు. ఎప్పటినుంచంటే..?

శబరిమలకు వెళ్లే భక్తులకు సూపర్ న్యూస్. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్నారా.. అయితే దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చర్లపల్లి నుంచి కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల వివరాలు ఇవిగో..

Venkatrao Lella
|

Updated on: Nov 16, 2026 | 7:06 PM

Share
కార్తీక మాసం రావడం, అయ్యప్ప దీక్షలు ప్రారంభమైన క్రమంలో శబరిమలకు భక్తుల తాకిడి పెరగనుంది. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులను తీసుకొస్తుంది. ఇప్పటికే పలు ప్రత్యేక సర్వీసులను ప్రకటించగా.. తాజాగా రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది

1 / 5
శబరిమలకు వెళ్లే రైళ్లలో భక్తుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి నుంచి కొల్లం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి – కొల్లం(07113)  ప్రత్యేక రైలు డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు తిరగనుంది. ఇది ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.

2 / 5
మధ్యాహ్నం 14.00 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి 19:15 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం – చర్లపల్లి(07114) ప్రత్యేక రైలు డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. తెల్లవారుజామున 02:30 గంటలకు కొల్లంలో బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 13:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

3 / 5
ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్లలో ఆగనుంది.

4 / 5
ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటికే ఈ రైల్లో రిజర్వేషన్లు కూడా మొదలయ్యాయి.

5 / 5
Follow Us