AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

  ఓటీటీలో మంచి ట్విస్టులున్న హారర్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్. పిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీసే కిల్లర్‌గా మారితే అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: పిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 16, 2026 | 8:42 PM

Share

ఓటీటీలో అన్న రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, హారర్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఈ మధ్యన హారర్ థ్రిల్లర్ సినిమాలకు బాగా ఆదరణ పెరిగిపోయింది. థియేటర్లలో ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. అందుకే ప్రతి వారం వివిధ భాషల్లో హిట్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో భారీగా వ్యూస్ సొంతం చేసుకుంటోంది. పిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీసే కిల్లర్‌గా మారితే అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎంతో ఎంగేజింగ్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ఘోరమైన కారు ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పో తాడు జేమ్స్. దీంతో తన తాతయ్య గెప్పెట్టో దగ్గరకు వస్తాడు. గెప్పెట్టో ఒక వింత ఆలోచనలు కలిగిన శాస్త్రవేత్త. ఒంటరితనంతో బాధపడుతోన్న తన మనవడి బాధ చూడలేక ఒక ప్రత్యేకమైన చెక్క బొమ్మను తయారు చేస్తాడు. ఆ బొమ్మే పినోచియో. మొదట్లో జేమ్స్, పినోచియో మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్

జేమ్స్ ను చూసి తాను కూడా నిజమైన మనిషిగా మారాలనే కోరిక పినోచియోలో బలపడుతుంది. ఆ కోరికను ఉపయోగించుకునే ఒక దుష్ట శక్తి బొమ్మను తప్పుదారి పట్టిస్తుంది. దీంతో పినోచియో ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. మనిషిగా మారాలన్న తన లక్ష్యాన్ని నిజం చేసుకోవడానికి దారుణాలకు పాల్పడుతాడు. మరి ఒకప్పుడు తనకు తోడుగా ఉన్న బొమ్మే ప్రమాదకరంగా మారితే జేమ్స్ పరిస్థితి ఏమిటి? పినోచియో దారుణాలను ఎవరు అడ్డుకున్నారు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా పేరు పినోచియో అన్‌స్ట్రంగ్ (Pinocchio Unstrung). దర్శకుడు రైస్ ఫ్రాక్-వాటర్‌ఫీల్డ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కామెరాన్ బెల్, రిచర్డ్ బ్రేక్ తాతా మనవడిగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ ఇంగ్లిష్ వెర్షన్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు పినోచియో అన్‌స్ట్రంగ్ కచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు. అయితే ఇందులో కొన్ని భయంకరమైన సన్నివేశాలున్నాయి. కాబట్టి చిన్న పిల్లలకు ఈ మూవీని చూపించకపోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి

పినోచియో అన్‌స్ట్రంగ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us