AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ టార్గెట్ భయం.. రహస్య స్థావరాలకు పాక్ ఉగ్రనేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజర్!

పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విషం కక్కిన ఉగ్రవాదులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోయిందా? ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోనని హడలిపోతున్నారా? భారత్ మరోసారి ఆపరేషన్ సిందూర్ తరహా దాడులకు దిగుతుందన్న భయమా? లేక పాకిస్థాన్‌లోనే గుర్తుతెలియని వ్యక్తులు తమను టార్గెట్ చేస్తారన్న ఆందోళనా? కారణం ఏదైనా భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌లు ఇప్పుడు తమ పాత స్థావరాలను వదిలి రహస్య ప్రాంతాలకు మకాం మార్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వీరిని దాచింది.

భారత్ టార్గెట్ భయం.. రహస్య స్థావరాలకు పాక్ ఉగ్రనేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజర్!
Amid India Gunmen Strike Fears Isi Hides Hafiz Saeed And Masood Azhar In Isi Safe Houses
Sharada V
|

Updated on: Nov 16, 2026 | 9:54 PM

Share

పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విషం కక్కిన ఉగ్రవాదులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోయిందా? ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోనని హడలిపోతున్నారా? భారత్ మరోసారి ఆపరేషన్ సిందూర్ తరహా దాడులకు దిగుతుందన్న భయమా? లేక పాకిస్థాన్‌లోనే గుర్తుతెలియని వ్యక్తులు తమను టార్గెట్ చేస్తారన్న ఆందోళనా? కారణం ఏదైనా భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌లు ఇప్పుడు తమ పాత స్థావరాలను వదిలి రహస్య ప్రాంతాలకు మకాం మార్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వీరిని దాచింది.

హఫీజ్ సయీద్‌కు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో షెల్టర్!

లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను లాహోర్‌లోని జోహార్ టౌన్ నుంచి రావల్పిండికి తరలించారు. అక్కడి గారిసన్ గ్రౌండ్ ప్రాంతంలో అతడికి రహస్య నివాసం ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైన్యం ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉండటం గమనార్హం. అంటే ఒకప్పుడు భారత్‌పై దాడులకు కుట్రలు పన్నిన వ్యక్తి ఇప్పుడు తన భద్రత కోసం పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే తలదాచుకుంటున్నాడు! అతడి కదలికలపై ఆంక్షలతో పాటు భద్రతను కూడా భారీగా పెంచింది. ఇంతకుముందు లష్కరే తోయిబా కార్యకర్తలను నేరుగా కలిసే సయీద్ ఇప్పుడు వారిని ముఖాముఖిగా కలవడం లేదట. కేవలం ఆడియో సందేశాల ద్వారానే సూచనలు ఇస్తున్నాడు.

మసూద్ అజర్‌ను ఎక్కడికి తరలించారంటే?

మరో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాకు తరలించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అక్కడ కూడా ఐఎస్ఐ నియంత్రణలో ఉన్న రహస్య స్థావరంలో భద్రత కల్పించారు. జైషే మహమ్మద్ సభ్యులతో అజర్ నేరుగా సమావేశాలు నిర్వహించడం లేదు. కేవలం అత్యంత నమ్మకమైన కొద్దిమంది సీనియర్ కమాండర్లతో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇలా ఇద్దరు ఉగ్ర నేతల కదలికలను పూర్తిగా పరిమితం చేసింది ఐఎస్‌ఐ.

ఆపరేషన్ సిందూర్ దెబ్బతో ఇంకా కోలుకోలేదా?

ఈ మార్పుల వెనుక భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఇందులో జైషే మహమ్మద్‌కు చెందిన బహవల్పూర్‌లోని మార్కజ్ సుభాన్ అల్లా స్థావరం, లష్కరే తోయిబాకు చెందిన మురిద్కే ప్రధాన కార్యాలయం కూడా ఉన్నాయి.

ఈ దాడుల్లో బహవల్పూర్ స్థావరం భారీగా దెబ్బతింది. దీంతో జైషే మహమ్మద్ తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు భారత్ నుంచి మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతోనే ఈ ఇద్దరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పాకిస్థాన్‌లోనూ ఉగ్రవాదులకు ప్రాణభయమేనా?

ఇటీవల పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వరుసగా హతమవుతున్నారు. హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌ల భద్రతపై ఐఎస్ఐ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఎప్పుడు ఎక్కడి నుంచి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితుల్లో వీరి కదలికలను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరి తరలింపునకు సంబంధించిన కారణాలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సయీద్ జైల్లో ఉన్నాడని చెబుతున్న పాకిస్థాన్!

హఫీజ్ సయీద్ విషయంలో పాకిస్థాన్ చెబుతున్న మాటలకు తాజా నివేదికకు పొంతన లేకుండా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన కేసుల్లో దోషిగా తేలడంతో సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని పాకిస్థాన్ అధికారికంగా చెబుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రికార్డుల్లోనూ అతడు పాకిస్థాన్ కస్టడీలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరి నుంచి ఏడు ఉగ్రవాద నిధుల కేసుల్లో దోషిగా తేలి మొత్తం 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు వివరాలున్నాయి. కానీ తాజాగా అతడు ఐఎస్ఐ రహస్య స్థావరంలో ఉంటున్నాడని నిఘా వర్గాలు చెబుతుండటం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

మసూద్ అజర్ ఆచూకీ చెబితే రూ.70 లక్షల బహుమతి!

మసూద్ అజర్ విషయంలోనూ పాకిస్థాన్ గతంలో కీలక ప్రకటన చేసింది. అతడు పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2026 సెప్టెంబర్‌లో అతడి ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయల బహుమతి ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం కేవలం ప్రచారమేనని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. తమ దేశీయ, అంతర్జాతీయ చట్టాలను అమలు చేయడంలో నిబద్ధతతో ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ సమర్థించుకుంది.

26/11 దాడుల సూత్రధారి నుంచి పుల్వామా కుట్రదారుల వరకు!

హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్యసమితి 2008 డిసెంబర్‌లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2008 నవంబర్ 26న ముంబైలో భయంకర ఉగ్రదాడులకు సూత్రధారి అతడేనని భారత్ ఆరోపిస్తోంది. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, మసూద్ అజర్‌ను 2019 మేలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో ఐసీ-814 విమానం హైజాక్ ఘటన తర్వాత విడుదలైన అజర్ జైషే మహమ్మద్ సంస్థను స్థాపించాడు. 2001 పార్లమెంట్‌పై దాడి, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి వంటి ఘటనల్లో ఈ సంస్థ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

మొత్తానికి.. భారత్ దాడుల భయమా? పాకిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణహానా? కారణం ఏదైనా ఒకప్పుడు బహిరంగంగా కార్యకలాపాలు సాగించిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఇప్పుడు రహస్య స్థావరాలకే పరిమితమయ్యారు.

Follow Us
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
మనీలా విందులో ఫిలిప్పీన్స్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన మోదీ
మనీలా విందులో ఫిలిప్పీన్స్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన మోదీ
గ్రాండ్‏గా తేజ సజ్జా నిశ్చితార్థం.. ఫోటోస్ ఇదిగో..
గ్రాండ్‏గా తేజ సజ్జా నిశ్చితార్థం.. ఫోటోస్ ఇదిగో..
భారత్ టార్గెట్ భయం.. రహస్య స్థావరాలకు పాక్ ఉగ్రనేతలు సయీద్, అజర్
భారత్ టార్గెట్ భయం.. రహస్య స్థావరాలకు పాక్ ఉగ్రనేతలు సయీద్, అజర్
త్రిపురాసురుడిని శివుడు ఎలా సంహరించాడు? దేవ దీపావళి వెనుక అసలు కథ
త్రిపురాసురుడిని శివుడు ఎలా సంహరించాడు? దేవ దీపావళి వెనుక అసలు కథ
నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన
నా ఓటుకు మీ నోటెందుకు.. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన
జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర..
జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర..
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం