Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 30న ఆటోలు బంద్.. ఎందుకంటే..?
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. ఈ నెల 30వ తేదీన ఆటోలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆటోల బంద్‌కు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆటో సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇచ్చారు.

హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. నవంబర్ 30వ తేదీన నగరంలో ఆటోలు బంద్ కానున్నాయి. ఆటో సంఘాల బంద్‌కు పిలుపునిచ్చిన క్రమంలో.. ఆటో సర్వీసులు నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుత మహాత్మాగాంధీ ఆటో డ్రైవర్ల జేఏసీ ఈ నెల 30న ఆటోల బంద్‌కు పిలుపునిచ్చింది. పెంచిన ఆటో ఛార్జీలను వెంటనే అమలు చేయడంతో పాటు గ్రీన్ క్యాబ్‌లపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆటో సంఘాలు వెల్లడిస్తాయి. ఆ రోజు ఆటోలు నిలిపివేసి ఆందోళనలు చేపడతామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు 15 రోజుల పాటు తమ డిమాండ్లను నేరవేర్చేందుకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఇటీవల ఆటో ఛార్జీలను భారీగా పెంచింది. అయితే ఈ చార్జీలు ఇంకా అమల్లోకి రాలేదు.
15 రోజుల్లోగా పెంచిన ఆటో ఛార్జీలను అమలు చేయాలని కోరుతూ ఆటోల యూనియన్లు బంద్‌కు దిగనున్నాయి. అప్పటిలోగా ఛార్జీలను అమలు చేయడంలో విఫలమైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదర్ గూడ ఎన్ఎస్ఎస్‌లో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం గ్రీన్ క్యాబులను అనుమతించడం వల్ల ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆదాయం ఉండదని, దీని వల్ల ఆర్ధికంగా నష్టపోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. గ్రీన్ క్యాబ్‌లను తీసుకురావాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, తక్షణమే వాటిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఆటో బ్లాక్ మార్కెట్ రాకెట్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్ధిక సాయం చేయాలని జేఏసీ నేతలు కోరారు. బెంగళూరు తరహాలో నగరంలో ద్విచక్ర వాహన ట్యాక్సీలపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇటీవల మరణించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ముకరం కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఆటో కనీస చార్జీని 1.6 కిలోమీటర్లకు రూ. 30కి పెంచింది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ. 14గా నిర్ణయించింది. అయితే వీటిని ఇంకా ప్రభుత్వం అమలు చేయలేదు.
