AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF0: పీఎఫ్‌ అకౌంట్ ద్వారా రూ.కోటి సంపాదించవచ్చు.. ఇది నిజంగా సూపర్ న్యూస్.. ఈ పని చేయండి..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు అధిక ఆదాయం పొందేందుకు అనేక మార్గాల గురించి అన్వేషిస్తున్నారు. పీఎఫ్ డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే పీఎఫ్ ఖాతాదారులు రూ.కోటి వరకు సంపాదించుకునే మార్గం ఒకటి ఉంది. మీరు దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కోటీశ్వరులు కావొచ్చు.

EPF0: పీఎఫ్‌ అకౌంట్ ద్వారా రూ.కోటి సంపాదించవచ్చు.. ఇది నిజంగా సూపర్ న్యూస్.. ఈ పని చేయండి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Nov 16, 2026 | 8:12 PM

Share

పీఎఫ్ అకౌంట్లో మీ నగదు పొదుపు చేసుకోవడం ద్వారా రూ.కోటి వరకు సంపాదించుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మీ పొదుపును కొనసాగించడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా భారీగా ఆదాయం పొందే సౌకర్యం ఉంది. అయితే ఎక్కువకాలం పాటు మీరు నిధులను అలాగే ఉంచుకోవాలి. దాని ద్వారా వచ్చే వడ్డీతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ప్రభుత్వ పథకాలతో పోలిస్తే పీఎఫ్ వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.25 శాతం వద్ద కొనసాగుతుంది. భవిష్యత్తులో వడ్డీని కేంద్రం పెంచితే మరింత ఆదాయం రావొచ్చు. మీరు మధ్యలో నిధులను విత్ డ్రా చేసుకోకుండా సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు.

ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలి..?

ఈపీఎఫ్‌లో ప్రతీనెలా రూ.10 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా 24 నుంచి 25 ఏళ్లల్లో రూ.కోటి వరకు సంపాదించే మార్గం ఉంది. పీఎఫ్‌కు అదనంగా స్వచ్చంధ ప్రావిడెంట్ ఫండ్(VPF) అనేది ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది. పీఎఫ్ కాంట్రిబ్యూషన్లతో సంబంధం లేకుండా ఈ స్కీములో మీరు అదనంగా డబ్బులను పొదుపు చేయవచ్చు. ప్రతీనెలా ఇందులో అదనంగా రూ.6 వేలు పెట్టుబడి పెట్టాలి. మీ బేసిక్ శాలరీ, డీఏలో 100 శాతం వరకు వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులోని డబ్బులకు కూడా 8.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఈపీఎఫ్ డబ్బులు, ఈ డబ్బులు మొత్తం కలిపితే 25 ఏళ్లకు రూ.కోటికిపైగా పంపాదించుకునే మార్గం ఉంది. అసలు మొత్తం, వడ్డీ, చక్రవడ్డీ మొత్తం కలిపి మీకు కోటికిపైగా ఆదాయం వస్తుంది.

ఈ పనులు చేస్తే కుదరదు

అయితే మీరు కెరీర్‌లో గ్యాప్ తీసుకోవడం, ఉద్యోగం మానేయడం వల్ల ఈపీఎఫ్, వీపీఎఫ్ ద్వారా రూ.కోటి సంపాదించుకోవడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని ముందుగా గుర్తుంచుకోవాలి. మీరు ఉద్యోగంలో గ్యాప్ తీసుకోవడం వల్ల పీఎఫ్, వీపీఎఫ్ ఫండ్ తగ్గుతుంది. దీని వల్ల వడ్డీ, చక్రవడ్డీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోతుంది. కెరీర్‌లో ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ప్రతీ నెలా నిధులు ఇన్వెస్ట్ చేస్తే లాభం ఉంటుంది.

వీపీఎఫ్ అంటే ఏంటి..?

వీపీఎఫ్ అనేది ఉద్యోగులు స్వచ్చంధంగా పొదుపు చేసుకునే ఆప్షన్. ఇందులో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది. యాజమాన్యం నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు. ఈ పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ మినహాయింపులు, రిటైర్మెంట్ లేదా రాజీమానా చేసినప్పుడు పూర్తిగా నిధులు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని పెట్టుబడులకు రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఉంటాయి. రూ.2.5 లక్షలకు మించకుండా చేసే కాంట్రిబ్యూషన్లు పన్ను పరిధిలోకి రావు. అంతకుమించిన కాంట్రిబ్యూషన్లు మాత్రమే పన్ను పరిధిలోకి వస్తాయి. పీఎఫ్ ద్వారా అధిక ఆదాయం పొందాలనుంటే బెస్ట్ ఆప్షన్ వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడమేని చెప్పవచ్చు.

Follow Us