బొద్దింకల సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇలా చేస్తే మళ్లీ కనిపించవు..!
ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ బొద్దింకలు ఎక్కువగా బయటకు వస్తాయి. వంటగదిలో బొద్దింకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకుండా చేయొచ్చునని తెలుసా? ఇలా చేస్తే భవిష్యత్తులో కూడా మీ ఇంట్లో బొద్దింకల సమస్య తగ్గుతుంది.

బొద్దింకలు చూడటానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, వీటిని చూస్తే చెప్పలేనంత చిరాకు వేస్తుంది. వీటివల్ల ఇళ్లంతా మురికిగా మారడమే కాకుండా మనకు లేనిపోని రోగాలు కూడా వస్తాయి. అందుకే, ఇంట్లో బొద్దింకలు లేకుండా చేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. గృహిణిలు పదే పదే ఇంటిని శుభ్రం చేసే పనులు చేస్తుంటారు కానీ, మీరు ఎంత శుభ్రం చేసినా బొద్దింకల సంఖ్య తగ్గదు. కానీ, మీరు ఈ చిన్న ట్రిక్ పాటించారంటే.. మీరు బొద్దింకలను ఈజీగా వదిలించుకోవచ్చు. ఈ ఉపాయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
బొద్దింకల సమస్య దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా, కొంత సమయం తర్వాత బొద్దింకలు మళ్ళీ బయటకు వస్తాయి. దీంతో ఇంట్లని మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ బొద్దింకలు ఎక్కువగా బయటకు వస్తాయి. వంటగదిలో బొద్దింకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకుండా చేయొచ్చునని తెలుసా? ఇలా చేస్తే భవిష్యత్తులో కూడా మీ ఇంట్లో బొద్దింకల సమస్య తగ్గుతుంది.
రాత్రిపూట బొద్దింకలు ఎక్కువగా ఇంట్లోకి వస్తుంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే..ముందుగా బొద్దింకలు ఇంట్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకోండి. ఇంట్లో నుంచి నీరు బయటకు వెళ్లే ప్రదేశాల్లో ఒక చిన్న వస్తువును ఉంచితే బొద్దింకలు వెంటనే మాయమవుతాయి. అంటే.. మీ వంటగది సింక్, కుళాయిలు, బయటి కాలువల నుండి బొద్దింకలు బయటకు వస్తుంటాయి. వాటిని వదిలించుకోవడానికి మీరు ఒక ప్రత్యేక మిశ్రమాన్ని సిద్ధం చేయాలి.
బొద్దింకలను తరిమికొట్టేందుకు ముందుగా ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల డెటాల్ తీసుకోండి. దీనితో పాటు, ఒక చెంచా నీరు తీసుకోండి. ఈ నాలుగు పదార్థాలను బాగా కలపండి. ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఈ మిశ్రమంలో ముంచి, సింక్, బాత్రూమ్, వాష్ బేసిన్‌లో ఉంచండి. ఇంటి మూలల్లో కూడా కాటన్ ప్యాడ్‌లను ఉంచాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




