How to Stop Snoring: గురకను శాశ్వతంగా నివారించే చిట్కాలు.. వెంటనే మీరూ పాటించండి
గురక.. అనేది గొంతులోని రిలాక్స్డ్ కణజాలాల గుండా గాలి ప్రవహించినప్పుడు సంభవించే ఒక రకమైన శబ్దం. దీని వల్ల ఊపిరి పీల్చుకున్నప్పుడు కణజాలం కంపిస్తుంది. ప్రతి ఒక్కరూ నిద్రలో కొన్ని సందర్భాల్లో గురక పెడతారు. కానీ కొంతమందికి ఇది సమస్యగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొన్ని తీవ్రమైన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కూడా కావచ్చు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా గురక నుంచి ఉపశమనం..

గురక.. అనేది గొంతులోని రిలాక్స్డ్ కణజాలాల గుండా గాలి ప్రవహించినప్పుడు సంభవించే ఒక రకమైన శబ్దం. దీని వల్ల ఊపిరి పీల్చుకున్నప్పుడు కణజాలం కంపిస్తుంది. ప్రతి ఒక్కరూ నిద్రలో కొన్ని సందర్భాల్లో గురక పెడతారు. కానీ కొంతమందికి ఇది సమస్యగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొన్ని తీవ్రమైన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కూడా కావచ్చు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా గురక నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..
అసలు గురక ఎందుకు వస్తుంది?
గురక తరచుగా అబ్‌స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అని పిలువబడే స్లీపింగ్ డిజార్డర్. అయితే అన్ని గురకలు OSAకి సంబంధించినవి కావు. OSA గురకలో కింది లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలో శ్వాసను ఆపడం, అధిక పగటి నిద్ర, నిద్ర లేవగానే గొంతు నొప్పి, రాత్రిపూట ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, రాత్రి ఛాతీ నొప్పి, అధిక రక్త పోటు, బిగ్గరగా గురక రావడం.. క్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గురక నివారణ మార్గాలు
జీవనశైలి మార్చుకోవడం ద్వారా గురక నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు తగ్గడం, నిద్రపోయే ముందు ఆల్కహాల్ తాగడం మానుకోవాలి, వెళ్లకిలా పడుకుని నిద్రపోకపోవడం, నిద్ర లేమిని నివారించడం.. వంటి చిన్నచిన్న మార్పులను చేసుకోవాలి. వెళ్లకిలా పడుకోవడం వల్ల కొన్నిసార్లు నాలుక గొంతు వెనుకకు వెళుతుంది. ఇది గొంతు ద్వారా గాలి ప్రవాహాన్ని పాక్షికంగా అడ్డుకుంటుంది. గాలి మరింత సులభంగా ప్రవహించడానికి, గురకను తగ్గించడానికి ఒకేఒక మార్గం ఒకవైపుకు తిరిగి పడుకోవడం. ఒకవైపుకు తిరిగి పడుకుంటే శ్వాస సులువుగా మారి గురక రాకుండా అడ్డుకుంటుంది.
తగినంత నిద్ర పొవాలి
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అండ్ స్లీప్ రీసెర్చ్ సొసైటీ ప్రకారం.. ప్రతి రోజూ 7-9 గంటలు నిద్రపోవాలి. తగినంత నిద్రలేకపోతే గురక వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి, నిద్ర లేకపోవడం వల్ల గురక వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇది గొంతులోని కండరాలను సడలిస్తుంది. తద్వారా వాయుమార్గంలో అడ్డంకి ఏర్పడుతుంది. గురక నిద్ర లేమి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే సాధారణంగా ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
తల కింద ఎత్తు పెట్టుకోవాలి
మంచంపై పడుకున్నప్పుడు తల కింద కొన్ని అంగుళాలు ఎత్తు పెట్టుకోవాలి. తద్వారా నాసికా వాయుమార్గాలను తెరిచి శ్వాస బాగా అడుతుంది. తల కింద ఎత్తుగా ఉండేందుకు బెడ్ రైజర్స్ లేదా దిండ్లు ఉపయోగించవచ్చు. అలాగే నాసికా స్ట్రిప్స్ లేదా నాసికా డైలేటర్ ఉపయోగించాలి. స్టిక్-ఆన్ నాసల్ స్ట్రిప్స్ వాడటం ద్వారా ముక్కు నాసికా భాగాలలో ఖాళీని పెంచడంలో సహాయపడవచ్చు. ఇది మీ శ్వాసను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఫలితంగా గురకను నివారించవచ్చు. బాహ్య నాసికా డైలేటర్‌ను కూడా ప్రయత్నించవచ్చు. ఇది ముక్కు పైభాగంలో నాసికా రంధ్రాలపై అంటించుకునే స్ట్రిప్. ఇది గాలి ప్రవాహం నిరోధకత తగ్గిస్తుంది.
పొగ తాగకూడదు
ధూమపానం గురక సమస్యను మరింత తీవ్రతరం చేసే అలవాటు. 2014 అధ్యయనం ప్రకారం.. గురకకు గల కారణాల్లో ధూమపానం కూడా ఒకటి. ధూమపానం OSA ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.








