AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holiday Heart Syndrome : సెలవే కదా అని ఎక్కువగా మద్యం తాగుతున్నారా? అయితే మీ గుండెకు గడ్డు రోజులే..

తర్వాత రోజు కూడా సెలవు వచ్చిందంటే చాలు మరీ ఎక్కువగా మద్యం తాగుతూ ఉంటాం. ముఖ్యంగా పండుగ సమయంలో లేదా ఇయర్ ఎండ్ ప్రాంతాలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది గుండె ఆరోగ్యానికి ఓ రుగ్మతేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Holiday Heart Syndrome : సెలవే కదా అని ఎక్కువగా మద్యం తాగుతున్నారా? అయితే మీ గుండెకు గడ్డు రోజులే..
Alchol And Heart
Nikhil
|

Updated on: Feb 24, 2023 | 1:30 PM

Share

వీక్ ఆఫ్ అప్పుడు, పండుగ సెలవుల సమయంలో ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో పార్టీ ఎంజాయ్ చేయడం అందరికీ అలవాటే.. ఇలాంటి పార్టీల్లో మద్యం అనేది సర్వ సాధారణ విషయం. ఇలాంటి సమయంలో తర్వాత రోజు కూడా సెలవు వచ్చిందంటే చాలు మరీ ఎక్కువగా మద్యం తాగుతూ ఉంటాం. ముఖ్యంగా పండుగ సమయంలో లేదా ఇయర్ ఎండ్ ప్రాంతాలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది గుండె ఆరోగ్యానికి ఓ రుగ్మతేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకమైన సందర్భాల్లో అధికంగా మద్యం తాగడం వల్ల హాలిడే హర్ట్ సిండ్రోమ్ అనే గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యతో బాధపడే అవకాశం ఉందని హెచరిస్తున్నారు. సక్రమంగా లేని హార్ట్ బీట్ ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చని పేర్కొంటున్నారు. ఈ హాలిడే హార్ట్ సిండ్రోమ్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ సారి తెలుసుకుందాం.

హాలిడే హార్ట్ సిండ్రోమ్ లక్షణాలు

అలసట : హాలిడే సీజన్‌లో వ్యక్తులు సాధారణం కంటే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. 

ఛాతీ వద్ద అసౌకర్యం : వ్యక్తులు ఛాతీ నొప్పి లేదా ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

దడ : వ్యక్తులు వారి ఛాతీలో అల్లాడుతున్నట్లు, రేసింగ్ లేదా కొట్టడం వంటి అనుభూతులను అనుభవించవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది : రోజువారీ కార్యకలాపాల సమయంలో లేదా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండవచ్చు.

హాలిడే హార్ట్ సిండ్రోమ్ సమయంలో కచ్చితంగా వైద్య సాయం పొందాలి. ఈ సిండ్రోమ్ సమస్యతో బాధపడేవారికి చికిత్స కూడా దానికి గురయ్యే వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది కార్డియోవర్షన్‌ చికిత్సను అందిస్తారు. అంటే హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరించడానికి చిన్నపాటి షాక్ లాంటి ట్రీట్ మెంట్. ఈ చికిత్స అనంతరం డాక్టర్లు రోగికి మద్యపానం మానేయమని సలహా ఇస్తారు.

హాలిడే హార్ట్ సిండ్రోమ్ నుంచి బయటపడేందుకు చిట్కాలు

మితమైన ఆహారం, పానియాలు 

హాలిడే హార్ట్ సిండ్రోమ్‌తో బారిన పడకుండా ఉండాలంటే పార్టీ సమయంలో మితమైన ఆహారంతో పాటు పానియాలు కూడా తక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన విషయంలో తగిని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఈవెంట్‌కు సరైన పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తిరస్కరించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మద్యపానం తక్కువగా ఉండాలని పేర్కొంటున్నారు.

చురుగ్గా ఉండడం

మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం కోసం పార్టీ ముందు రోజుతో పాటు పార్టీ అయ్యాక కూడా చురుకైన జీవనశైలితో ఉండడం చాలా కీలకం. అలాగే రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉండే దాన్ని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయాలి.

ఒత్తిడి నిర్వహణ

సెలవు రోజుల్లో దినచర్య ఒక్కోసారి ఒత్తిడికి గురికావచ్చు. అధిక ప్రయాణం వంటి విషయాలు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం వంటి చర్యల వల్ల ఒత్తిడిని నిర్వహించాలి.

మందులు తీసుకునే సమయంలో జాగ్రత్తలు

ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగోవర్ వంటి లక్షణాలు ఉంటే నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మందులు రక్తపోటును పెంచి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..