AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Problems: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు గుండె ప్రాబ్లమ్స్ గ్యారెంటీ

అమిలాయిడ్ నిక్షిప్తాలు గుండెలో పేరుకుపోవడం వల్ల గుండె ప్రభావవంతంగా రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. అమిలోయిడోసిస్ ప్రధాన లక్షణాలు ఓ సారి తెలుసుకుందాం.

Heart Problems: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు గుండె ప్రాబ్లమ్స్ గ్యారెంటీ
Heart Attack
Nikhil
|

Updated on: Feb 07, 2023 | 12:57 PM

Share

మానవ శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో? అందరికీ తెలుసు. మనకు ఏ సమస్య వచ్చినా దాని దీర్ఘకాలిక పరిణామం గుండెను ప్రభావితం చేస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యానికి సంబంధించిన చిన్నపాటి సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గుండెకు సంబంధించి కార్డియాక్ అమిలోయిడిస్ అనేది తీవ్రమైన పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా గుండె పని చేసే సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. అమిలాయిడ్ నిక్షిప్తాలు గుండెలో పేరుకుపోవడం వల్ల గుండె ప్రభావవంతంగా రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. అమిలోయిడోసిస్ ప్రధాన లక్షణాలు ఓ సారి తెలుసుకుందాం.

అమిలోయిడోసిస్ లక్షణాలు

కార్డియాక్ అమిలోయిడోసిస్ సోకిన వారిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందులు, అలసట, సక్రమంగా లేని హర్ట్ బీట్ వంటి లక్షణాలను గమనించవచ్చు. ఈ పరిస్థితుల వల్ల గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. అమిలోయిడోసిస్ ప్రారంభం ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమేపి తీవ్రమైన లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో మైలోమా అంటారు. అంటే ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. దీని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.

అమిలోయిడోసిస్ చికిత్స

అమిలోయిడోసిస్ చికిత్స అనేది లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతర్లీన పరిస్థితికి చికిత్సను అందించడం ద్వారా కార్డియాక్ అమిలోయిడోసిస్ ను సక్రమ నిర్వహణకు సాయం చేస్తుంది. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా తీవ్రం కాకుండా మాత్రం మందులు వాడే అవకాశం ఉంది. మీకు కార్డియాక్ అమిలోయిడోసిస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే వ్యాధి ప్రారంభ సమయంలోనే చికిత్సను అందించవచ్చు. అలాగే కార్డియాక్ అమిలోయిడోసిస్ తీవ్రమైన గుండె సమస్య అయినప్పటికీ అది కొంత మందిలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యాధిపై అవగాహనతో ఉండడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగానే చికిత్స తీసుకోవడం ఈ సమస్య నుంచి బయటపడడమే ఇతర వ్యాధులను రాకుండా అడ్డుపడవచ్చని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్  టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..