AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Lips: చలికాలంలో పగిలిన పెదవులు ఇబ్బంది పెడుతున్నాయా..? ఈ సులభమైన చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టేయండి..

చలికాలంలో చర్మ సమస్యలతో పాటు పెదవులు పొడి బారటం, నల్లగా మారటం వల్ల ముఖంలో అందం కరువవుతుంది. మరి అలాంటి సమయంలో చర్మ సంరక్షణలో

Healthy Lips: చలికాలంలో పగిలిన పెదవులు ఇబ్బంది పెడుతున్నాయా..? ఈ సులభమైన చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టేయండి..
Healthy Lips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 07, 2023 | 1:31 PM

Share

Healthy Lips: మన కవులు తమ కవితలలో స్త్రీ పెదవులను గులాబీ రేకులతో పోలుస్తారు. ముఖానికి ముందుండే పెదవులే అందాన్ని ఇస్తాయి. ఇదే విషయాన్ని కవులు కూడా పదే పదే ప్రస్తావిస్తుంటారు. అయితే సున్నితమైన చర్మాన్ని కలిగి ఉండే పెదవులను ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఇక చలికాలంలో చర్మ సమస్యలతో పాటు పెదవులు పొడి బారటం, నల్లగా మారటం వల్ల ముఖంలో అందం కరువవుతుంది. మరి అలాంటి సమయంలో చర్మ సంరక్షణలో భాగంగానే కొన్ని రకాల చిట్కాలను అనుసరించటం ద్వారా పెదవులు అందంగా ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు. మరి అందుకోసం ఏమి చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ముందుగా బాదం నూనె, తేనె, ఒక టీ స్పూన్ చక్కెర తీసుకుని మిశ్రమంగా మార్చుకోవాలి. దానిని పెదవులకు స్క్రబ్‌గా వేసుకోవాలి. అనంతరం పెదవులపై సున్నితంగా అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల పెదవులపై మృతచర్మం తొలగిపోతుంది. పెదవులకు తేమ వచ్చి గులాబీ రంగు పెదాలు మీ సొంతమవుతాయి.
  2. కలబంద సేకరించి దానిలోని గుజ్జును వేరు చేయాలి. ఆ గుజ్జును పెదవులపై అప్లై చేయటం ద్వారా పెదవులను మృధువుగా అందంగా మార్చుకోవచ్చు.
  3. రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనెను రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల పెదవులు పొడి బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
  4. రోజువారిగా నీటిని సరిపడిన మోతాదులో తీసుకోవాలి. డీ హైడ్రేషన్ కారణంగా కూడా పెదవులు పొడిబారిపోతాయి. తద్వారా అవి కళావిహీనంగా మారతాయి. కాబట్టి రోజువారిగా తగిన మోతాదులో నీరు తీసుకుంటే పెదవులు తాజాగా మెరుపుదనంతో ఉంటాయి.
  5. పెదవులుకు చాలా మంది లిఫ్స్టిక్ వేస్తుంటారు. రసాయనాలతో తయారయ్యే లిప్టిక్ వల్ల పెదవుల సహజత్వం దెబ్బతింటుంది. కాబట్టి నేచరుల గా లభించే దానిమ్మ రసం, బీట్ రూట్ రసాన్ని ఉపయోగించటం ద్వారా పెదవులు మంచి రంగులో ఉండేలా చూసుకోవచ్చు. అంతేకాకుండా పొడి బారటాన్ని నివారించవచ్చు.
  6. లిఫ్టిక్ ను డైరెక్ట్ గా పెదవులపై వేసుకోకుండా ముందుగా పెదవులకు కొంచెం కొబ్బరినూనె అప్లై చేసుకోవాలి. ఆతరువాత మాత్రమే లిఫ్టిక్ పూసుకోవాలి. కొబ్బరి నూనె పెదవులకు నష్టం కలగకుండా రక్షణ కవచంలా దోహదపడుతుంది. పెదవులకు తేమను అందిస్తుంది.
  7. గులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలకు పట్టించాలి. ఇలా చేస్తే పెదాలు పగలకుండా మృదువుగా ఉంటాయి. వారానికి ఒకసారి టూత్ బ్రష్ తో పెదాలపై మృదువుగా రుద్దితే అక్కడ మృత చర్మం పోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..