Holi Eye Care Tips: హోలీ వేడుకల వేళ కళ్ళను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా.. నిపుణుల సలహా ఏమిటంటే
హోలీ పండుగ సందడి మొదలైంది. డిల్లీ నుంచి గల్లీ వరకూ ఎక్కడ చూసినా రంగులు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికే రకరకాల రంగులను కొనుగోలు చేశారు. అయితే హోలీ ఆడుతున్నప్పుడు, మీ చర్మం, కళ్ళు, జుట్టుని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హోలీ ఆడే సమయంలో కళ్ళను సురక్షితంగా ఉంచుకోవడానికి ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. వీటిని పాటించడం వలన హోలీ ఆడే సమయంలో రంగులు మీ కళ్ళపై ప్రభావం చూపవు.

హోలీ పండుగకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది హోలీ పండగకు మార్చి 14వ తేదీ శుక్రవారం నాడు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ రంగుల పండుగ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరూ ఎంతో ఉత్సాహంగా హోలీ ఆడుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటారు. అయితే ఈ పండగను జరుపుకునే సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. హోలీ రోజున రసాయనాలు కలిసిన రంగులకు దూరంగా ఉండండి.. సహజంగా తయారు చేసిన హెర్బల్ కలర్స్ మాత్రమే వాడండి.
డాక్టర్ బసు ఐ సెంటర్ కంటి నిపుణులు మన్దీప్ బసు మాట్లాడుతూ.. పస్తుతం మార్కెట్ లో హోలీ కోసం సింథటిక్ రంగులు మార్కెట్లోకి వచ్చాయని చెప్పారు. హోలీ సమయంలో ఉపయోగించే రంగులు చర్మాన్ని మాత్రమే కాదు కళ్ళను కూడా ప్రభావితం చేస్తాయి. అయితే శరీరంలో అత్యంత సున్నితమైన భాగం కళ్ళు. కనుక ఈ రంగుల పండుగ సమయంలో కళ్ళు రక్షణ చాలా ముఖ్యం. హోలీ ఆడుతున్నప్పుడు మనం ఏ విషయాలను గుర్తుంచుకోవాలో నిపుణుల మన్దీప్ బసు చెప్పిన సలహాల గురించి తెలుసుకుందాం..
కళ్ళను శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి
హోలీ ఆడుతున్నప్పుడు.. కళ్ళు దగ్గర రంగులు పడితే.. వెంటనే కళ్ళ చుట్టూ ఉన్న రంగులను శుభ్రమైన నీటితో కడగాలి. ఇందుకోసం రోజ్ వాటర్ ను కూడా ఉపయోగించవచ్చు, ఎందుకంటే రోజ వాటర్ కళ్ళ దగ్గర పడిన రంగు, దుమ్మును తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ముఖం మీద చికాకును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
సన్ గ్లాసెస్ ఉపయోగించండి
సింథటిక్ రంగుల నుంచి కళ్ళను రక్షించుకోవడానికి హోలీ ఆడుతున్నప్పుడు సన్ గ్లాసెస్ లేదా కళ్ళకు రక్షణ ఇచ్చే కళ్లజోడు ధరించాలి. ఇది రంగులలో ఉండే రసాయనాల నుంచి కళ్ళను కాపాడుతుంది. హోలీ సమయంలో లెన్స్‌లు ధరిస్తే.. మార్కెట్లో లభించే రోజువారీ డిస్పోజబుల్ లెన్స్‌లను తీసుకోండి. ఇది రంగుల కారణంగా కళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
కళ్ళను రుద్దకండి – హోలీ ఆడుతున్నప్పుడు రంగుల చేతులతో కళ్ళను తాకవద్దు. కళ్ళను రుద్దితే చేతులకు ఉన్న రంగు కళ్ళను చికాకు గురి చేస్తుంది.. ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. మీ కళ్ళు దురద పెడితే లేదా మంట పెడితే, కంటి టిష్యూ వైప్స్ వాడండి లేదా శుభ్రమైన రుమాలు లేదా నీటితో సున్నితంగా శుభ్రం చేయండి.
వైద్యుల సలహా లేకుండా ఐ డ్రాప్స్ ను వాడకండి – హోలీ ఆడుతున్నప్పుడు కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఎదురైతే.. వెంటనే వైద్య సలహా తీసుకోండి. కంటి వైద్య నిపుణుల సలహా లేకుండా ఐ డ్రాప్స్ ఉపయోగించవద్దు. స్టెరాయిడ్లు కలిగిన కంటి చుక్కలను నివారించండి. ఎందుకంటే ఇవి కంటికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే కంటి సమస్యలను కలిగిస్తాయి.
కాంటాక్ట్ లెన్స్‌లు ధరించవద్దు – కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని రంగులతో హోలీ ఆడితే రంగు రసాయనాలు లెన్స్‌లలో చిక్కుకుంటాయని.. అప్పుడు చికాకు, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు లెన్స్‌లు ధరించాల్సి వస్తే రోజూ వాడిపారేసే లెన్స్‌లను వాడండి. వాటిని వెంటనే పారవేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..