High Fiber Foods: వందేళ్లు ఎలాంటి వ్యాధులు రాకుండా జీవించాలంటే.. వీటిని తప్పక తినాలి

శరీరంలో తగినన్ని పోషకాలు లేకపోవడం వల్ల రోగనివారణ వ్యవస్థ తగ్గిపోతుంది. ఫలితంగా రకరకాల వ్యాధులు దాడి చేస్తాయి. అందరి ఆహార అలవాట్లు ఒకేలా ఉండవు. కొందరు స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడితే.. మరికొందరేమో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పోషకాహారం తీసుకోకపోతే శరీరంలో అనేక పోషకాలు లోపిస్తాయి. శరీరానికి ప్రొటీన్లు ఎంత అవసరమో, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా తక్కువ మోతాదులో అవసరం. విటమిన్ డి, మినరల్స్‌ ఆరోగ్యానికి..

High Fiber Foods: వందేళ్లు ఎలాంటి వ్యాధులు రాకుండా జీవించాలంటే.. వీటిని తప్పక తినాలి
High Fiber Foods
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 03, 2023 | 9:41 PM

శరీరంలో తగినన్ని పోషకాలు లేకపోవడం వల్ల రోగనివారణ వ్యవస్థ తగ్గిపోతుంది. ఫలితంగా రకరకాల వ్యాధులు దాడి చేస్తాయి. అందరి ఆహార అలవాట్లు ఒకేలా ఉండవు. కొందరు స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడితే.. మరికొందరేమో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పోషకాహారం తీసుకోకపోతే శరీరంలో అనేక పోషకాలు లోపిస్తాయి. శరీరానికి ప్రొటీన్లు ఎంత అవసరమో, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా తక్కువ మోతాదులో అవసరం. విటమిన్ డి, మినరల్స్‌ ఆరోగ్యానికి చాలా అవసరం. నేటి కాలంలో చాలా మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

విటమిన్ బి12, విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైనవి. అలాగే ఆరోగ్యానికి ఫైబర్ కూడా చాలా అవసరం. ఫైబర్‌లోని పీచు ఆకలి వేయకుండ చేసి, కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండేలా చేస్తుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని రక్షించడంలో ఫైబర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఫైబర్ ఉంటే 100 సంవత్సరాల వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫైబర్‌ అధికంగా ఏయే ఆహారాల్లో ఉంటుందంటే..

బేరి పండ్లు

ఫైబర్‌ అధికంగా ఉండే పండ్లలో బేరి పండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. బేరి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల బేరిలో 3.1 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. బేరీ పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సహాయపడతాయి. ఇది బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటును నివారించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఫైబర్ కూడా వీటిల్లో పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీలు తినడం వల్ల వీటిల్లోని పోషకాలు వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఓట్స్

ఓట్స్‌లో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తింటే బరువు సులువుగా తగ్గుతారు. ఓట్స్ కూడా జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నివారించగలవు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు ఓట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.

పప్పులు

పప్పుల్లో ప్రోటీన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. పప్పు వారానికి కనీసం 4-5 రోజులు తినాలి. ఇది జీర్ణక్రియ, జీవక్రియను పెంచుతుంది. అలాగే ప్రతిరోజూ పండ్లు, పప్పులు, గింజలు కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగాల నుంచి కాపాడే రోగనిరోధకతను బలంగా ఉంచుతాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.