AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhujangasana Yoga: మీ పొట్ట ఫ్లాట్ గా అవ్వాలంటే రోజూ ఈ ఆసనాన్ని ఐదు నిమిషాలు వేయండి!!

యోగాతో అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. యోగాతో సమస్యలకు చెక్ పెట్టుకోవడమే కాదు.. అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యోగాలో కొన్ని రకాల ఆసనాలను రోజూ వేస్తే అనేక ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతూంటారు. ఇలాంటి వారికి ఏ పని చేయాలన్నా.. వంగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు ఈ యోగాసనం వేస్తే కేవలం నెల..

Bhujangasana Yoga: మీ పొట్ట ఫ్లాట్ గా అవ్వాలంటే రోజూ ఈ ఆసనాన్ని ఐదు నిమిషాలు వేయండి!!
Bhujangasana
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 04, 2023 | 12:00 PM

Share

యోగాతో అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. యోగాతో సమస్యలకు చెక్ పెట్టుకోవడమే కాదు.. అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యోగాలో కొన్ని రకాల ఆసనాలను రోజూ వేస్తే అనేక ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతూంటారు. ఇలాంటి వారికి ఏ పని చేయాలన్నా.. వంగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు ఈ యోగాసనం వేస్తే కేవలం నెల రోజుల్లోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. యోగాలో భుజంగాసనం కూడా ఒకటి. ఇది వేయడం చాలా సింపుల్. భుజంగ అంటే సంస్కృతంలో పాము అని అర్థం. నాగు పాము ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో ఈ ఆసనాన్ని వేయాలి. మరి ఈ భుజంగాసనం ఎలా వేయాలి? దీంతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భుజంగాసనం ఎలా వేయాలంటే:

భుజంగాసనాన్ని వేయడం కోసం ముందుగా మ్యాట్ పై బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత చేతులతో నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపాలి. నెక్ట్స్ తలను పైకెత్తి చూడాలి. పగడ విప్పిన నాగు పాము ఎలా ఉంటుందో.. ఈ ఆకారంలో మీరు వేసిన ఆకారం ఉండాలి. ఈ భంగిమలో 5 నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి రావాలి. ఇలా రోజూ మీకు కుదిరిన సమయంలో ఆసనం వేస్తూ ఉంటే చక్కటి ప్రయోజనాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

భుజంగాసనం ప్రయోజనాలు:

మెడ, భుజాలు దృఢంగా ఉంటాయి:

ఈ ఆసనాన్ని రోజూ క్రమం తప్పకుండా వేయడం వల్ల మెడ, భుజాలు దృఢంగా ఉంటాయి. నొప్పులు ఏమైనా ఉన్నా వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కంప్యూటర్ల ముందు పని చేసే వారికి భుజాలు, మెడ భాగాలు నొప్పిగా ఉంటాయి. ఇలాంటి వారికి ఆ ఆసనం బాగా హెల్ప్ అవుతుంది.

బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా దృఢంగా ఉంటాయి:

బెల్లీ ఫ్యాట్ తో ఉన్న వారికి ఈ ఆసనం బాగా హెల్ప్ అవుతుంది. పొట్ట కండరాలు దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ ఆసనాన్ని తరచూ వేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. పొత్తి కడుపు కండరాలపై ఒత్తిడి తీసుకొచ్చి.. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది.

ఆస్తమా వారికి ఈ ఆసనం హెల్ప్ అవుతుంది:

ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్న వారు ఈ ఆసనం తరచూ వేసుకోవడం వల్ల రిలీఫ్ గా ఉంటుంది. శ్వాస కోశ సమస్యలు కూడా ఉండవు.

వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుంది:

భుజంగాసనాన్ని తరచూ వేయడం వల్ల కూడా వెన్నుముక బలంగా ఉంటుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!