AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric for Diabetes: అద్భుతాలు చేసే పసుపుతో షుగర్ లెవల్స్‌ను ఇలా కంట్రోల్ చేయండి..

పసుపు ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. పసుపు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇతర సమస్యలే కాకుండా.. డయాబెటీస్‌ని కూడా కంట్రోల్ చేసే గుణాలు పసుపులో ఉన్నాయట..

Turmeric for Diabetes: అద్భుతాలు చేసే పసుపుతో షుగర్ లెవల్స్‌ను ఇలా కంట్రోల్ చేయండి..
పసుపు పిత్తాశయ రాళ్ల సమస్యలను తీవ్రతరం చేస్తుంది. పిత్తాశయ రాళ్లు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. కాలేయ సమస్యలు ఉన్నవారికి పసుపు పాలు దానిని మరింత తీవ్రతరం చేస్తాయి. గర్భిణీ, పాలిచ్చే స్త్రీలు పసుపు సప్లిమెంట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి.
Chinni Enni
|

Updated on: Dec 14, 2024 | 4:24 PM

Share

షుగర్ వ్యాధికి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి మహామ్మారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ షుగర్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్‌ను తగ్గించేందుకు ఇప్పటికీ సరైన మందు లేదు. కేవలం ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఎన్నో రకాల వ్యాధుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడంలో పసుపు కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని అధ్యయనాల ప్రకారం షుగర్ ఉన్నవారు తరచూ పసుపుని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. నేచురల్‌గానే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. పసుపును ఎప్పుడూ తీసుకునేటట్టుగా కాకుండా ఇప్పుడు చెప్పినట్టుగా తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ మీరే పొందుతారు. మరి అదెలాగో ఇప్పుడు చూసేయండి.

దాల్చిన చెక్క – పసుపు:

దాల్చిన చెక్క పొడితో కలిపి పసుపు కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిలో కూడా అనేక ఔషధాలు ఉన్నాయి. ఈ రెండింటిని పొడిలా చేసి.. ఉదయాన్నే గోరు వెచ్చటి పాలలో కలిపి తాగవచ్చు. ఇవి ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

పసుపు – మిరియాలు:

పసుపు మిరియాలను కలిపి తీసుకున్నా డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. కేవలం డయాబెటీస్ మాత్రమే కాకుండా సీజనల్ వ్యాధులు కూడా త్వరగా రాకుండా ఉంటాయి. ఓ గ్లాస్ గోరు వెచ్చని పాలలో మిరియాలు, పసుపు కలిపిన పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

పసుపు:

కూరల్లోనే కాకుండా గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగినా కూడా షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ప్రతి రోజూ ఉదయం లేదా రాత్రైనా ఇలా తాగండి. కొద్ది రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.

తేనె – పసుపు:

తేనె పసుపు కూడా కలిపి తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి. కొద్దిగా పసుపులో తేనె మిక్స్ చేసి.. ఉదయం, సాయంత్రం ఒక ఆఫ్ స్పూన్ తింటే.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. అంతే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు