ఈ నల్లని పండులో ఇన్ని ఆరోగ్య రహస్యాలా?

11 June 2026

TV9 Telugu

TV9 Telugu

నల్లగా నిగనిగలాడే నేరేడుపండును చూస్తేనే నోరూరిపోతుంది. కండ తక్కువ, గింజ పెద్దది కనుక ఎన్ని తిన్నా తిన్నట్టే ఉండదు. ఇవి రుచిలోనే కాదు, ఆరోగ్యం కూడా అందిస్తాయి

TV9 Telugu

నేరేడుపండ్లు తినటం వల్ల శరీరానికి అవసరమైన క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, సల్ఫర్, థియామిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్‌ యాసిడ్‌తోపాటు పలు విటమిన్లు అందుతాయి

TV9 Telugu

రక్తపోటును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి. బరువు తగ్గటంలో తోడ్పడతాయి. కీళ్లనొప్పులను నివారిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి

TV9 Telugu

జుట్టు రాలదు, కుదుళ్లు దృఢంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను హరింపచేస్తాయి. కాలేయాన్ని సంరక్షిస్తాయి. గొంతులో వచ్చే సమస్యలను నివారిస్తాయి

TV9 Telugu

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతితో మెరిసేలా చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

TV9 Telugu

రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవటం వల్ల సత్వర ప్రయోజనం ఉంటుంది

TV9 Telugu

ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలను తగ్గిస్తాయి.నేరేడు గింజలు మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తే, ఆకులు అలర్జీలను తగ్గిస్తాయి

TV9 Telugu

నేరేడుపండ్లు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగపడతాయి. వీటిని అలాగే తినొచ్చు, జ్యూస్, సలాడ్, జామ్‌ రూపాల్లో తీసుకోవచ్చు