బంగాళాదుంపల్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిపై చిన్న చిన్న మొలకలు రావడం, క్రమంగా అవి పెద్దవవడం గమనిస్తుంటాం
TV9 Telugu
అయితే చాలామంది ఆ మొలకల్ని తొలగించి వండుకుంటారు. కానీ అది ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఆ మొలకల్లో ఉండే కొన్ని రకాల విషపదార్థాలు కడుపులోకి చేరితే వికారం, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు.. వంటి సమస్యలొస్తాయట
TV9 Telugu
అందుకే మొలకెత్తిన దుంపల్ని పక్కన పెట్టేయడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇవి మొలకలు రావడానికి వెలుతురు, వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయడమే కారణమట
TV9 Telugu
అదే చల్లగా, చీకటిగా, పొడిగా ఉండే ప్రదేశాల్లో దుంపల్ని నిల్వ చేయడం వల్ల వాటిపై మొలకలు రాకుండా నివారించచ్చంటున్నారు నిపుణులు
TV9 Telugu
సాధారణంగా మొలకెత్తిన గింజల్ని పచ్చిగానే తీసుకోవడం మనకు అలవాటు. కొంతమంది వీటితో వివిధ రకాల వంటకాలు తయారుచేసుకొనీ తీసుకుంటారు
TV9 Telugu
అయితే కొన్ని రకాల మొలకల్ని పచ్చిగా తినకూడదు. ముఖ్యంగా చిక్కుళ్లు, ఆల్ఫాల్ఫా గింజల మొలకలు పచ్చిగా తీసుకోవడం వల్ల కొంతమందిలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందిస
TV9 Telugu
ఈ మొలకల్ని పచ్చిగా కాకుండా బాగా ఉడికించుకొని తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా జాగ్రత్తపడవచ్చు