Health: మీ శరీరంలో అనూహ్యంగా ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే మీరు బరువు పెరుగుతున్నట్లే లెక్క..
Health: మారుతోన్న జీవన శైలి ఆధారంగా అనారోగ్య సమస్యలు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఇటీవల చాలా మంది...
Health: మారుతోన్న జీవన శైలి ఆధారంగా అనారోగ్య సమస్యలు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఇటీవల చాలా మంది అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. అయితే మనలో చాలా మంది బరువు పెరుగుతున్నామన్న విషయం తెలియకుండానే ఊబకాయం బారిన పడుతుంటారు. ఒక్కసారి బరువు పెరిగామంటే ఇక తగ్గించుకోవడం అంత సులభమైన విషయం కాదు.
అయితే శరీరంలో చోటుచేసుకునే కొన్ని మార్పుల ఆధారంగా ఊబకాయ సమస్యను ముందుగానే గుర్తించవచ్చనే విషయం మీకు తెలుసా.? ఇంతకీ బరువు పెరిగే సమయంలో శరీరంలో చోటుచేసుకునే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుందంటే అధికంగా బరువు పెరుగుతున్నామని అర్థం చేసుకోవాలి. ఇక అలాగే మహిళల్లో రుతుక్రమం సరైన సమయానికి జరగకపోతున్నా వారు అనూహ్యంగా బరువు పెరుగుతున్నారని గుర్తించాలి.
* ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తుందంటే మీరు బరువు పెరుగుతున్నారని గుర్తించాలి. ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యలు లేకున్నా ఊపిరిపీల్చుకోవడంలో సమస్యగా ఉందంటే ఓసారి బరువు చెక్ చేసుకోవడం మంచిది.
* ఇక తక్కువ సమయంలో మీరు ధరిస్తోన్న దుస్తులు టైట్‌గా మారుతున్నాయంటే మీరు అధిక బరువు బారిన పడినట్లే లెక్క. సహజంగా ఒక సమయానికి దుస్తులు ఎలాగో బిగుతుగా మారుతాయి. కానీ తక్కువ వ్యవధిలో ఇలా జరుగుతుందంటే కచ్చితంగా ఊబకాయమే అని అర్థం చేసుకోవాలి.
* కాళ్లు, పాదాల్లో వాపు కనిపించినా ఊబకాయానికి ముందస్తు లక్షణంగా భావించాలి. అధిక బరువు ఉండటం వల్ల కాళ్ల సిరలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది గుండెకు రక్తాన్ని తీసుకురావడానికి పని చేస్తుంది. మీరు బరువు పెరుగుతుంటే సిరల ద్వారా రక్తం సరిగా వెళ్లదు. దీని కారణంగా కాళ్లు, పాదాలలో వాపు వస్తుంది.
* ఏ చిన్న పనిచేసినా, నాలుగు అడుగులు వేసినా ఆయాసం వస్తుందంటే మీ బరువు అనూహ్యంగా పెరుగుతుందని భావించాలి.
చూశారుగా పైన తెలిపిన లక్షణాల్లో ఏవీ మీ శరీరంలో కనిపించినా వెంటనే బరువు చెక్ చేసుకొని అనూహ్యంగా పెరిగినట్లు కనిపించినా.. వెంటనే బరువు తగ్గించుకునేందుకు తక్షణ చర్యలు ప్రారంభించాలి. వాకింగ్, వ్యాయామం వంటి వాటితో బరువును తగ్గించుకోవచ్చు.
Also Read: T20 World Cup: అదిరిపోయే క్యాచ్ పట్టిన ఆదిల్ రషీద్.. గాల్లో ఎగిరి..
Telangana: పోడు రైతులకు గుడ్ న్యూస్.. భూముల సమస్యకు చెక్.. సీఎం ఆదేశాలు
Varudu Kaavalenu Event Live: వరుడు కావలెను ప్రీ రిలీజ్.. ముఖ్యఅతిథిగా బన్నీ..