T20 World Cup: అదిరిపోయే క్యాచ్ పట్టిన ఆదిల్ రషీద్.. గాల్లో ఎగిరి..

టీ20 ప్రపంచకప్‌2021లో ఆటగాళ్లు అదిరిపోయే క్యాచ్‎లు పడుతున్నారు. బుధవారం ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఆదిల్‌ రషీద్‌ అద్బుతమైన క్యాచ్‌ పట్టాడు...

T20 World Cup: అదిరిపోయే క్యాచ్ పట్టిన ఆదిల్ రషీద్.. గాల్లో ఎగిరి..
Adil
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 27, 2021 | 8:58 PM

టీ20 ప్రపంచకప్‌2021లో ఆటగాళ్లు అదిరిపోయే క్యాచ్‎లు పడుతున్నారు. బుధవారం ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఆదిల్‌ రషీద్‌ అద్బుతమైన క్యాచ్‌ పట్టాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‎ రెండో బంతిని షకీబ్‌ అల్‌ హసన్‌ బౌండరీ తరలించేందుకు భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది కాస్త మిస్‌ టైమ్‌ అయ్యి బాల్ గాల్లోకి లేచింది. షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రషీద్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ను అందకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 125 పరుగుల టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.1 ఓవర్లలో విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేందించేందుకు ఓపెనర్లుగా వచ్చిన జేసన్ రాయ్ 61( 38 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో అద్భుమైన అర్థ సెంచరీతో ఇంగ్లండ్ టీంను విజయపథంలో నడిపించాడు. జాస్ బట్లర్ 18, మలాన్ 28 నాటౌట్, జానీ బెయిర్ స్టో 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

అంతకు ముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తరఫున టిమల్‌ మిల్స్‌ మూడు వికెట్లు తీయగా, మొయిన్‌ అలీ, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ రెండు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్‌లో ముష్ఫికర్ రహీమ్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మహ్మదుల్లా 19, నసుమ్ అహ్మద్ 19 నాటౌట్‌గా నిలిచారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లితన్ దాస్(9), మొహ్మద్ నయీం(5) నిరాశపరిచారు. వెంటవెంటనే ఇద్దరూ తమ వికెట్లను కోల్పోయారు. మొయిన్ అలీ బౌలింగ్‎లో 3వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన షకీబుల్ హసన్ (4) మరోసారి బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. ఫాంలో ఉన్న రహీం 27(27 బంతులు, 3 ఫోర్లు) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి మహ్మదుల్లా 12 (11 బంతులు, 1 ఫోర్), అసిఫ్ సున్నా పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 2, వోక్స్ 1, లివింగ్ స్టోన్ 1 వికెట్ పడగొట్టారు.

ఆక్టోబర్ 23న ఆస్ట్రేలియాతో జరిగిన మాచ్య్‎లో దక్షిణాఫ్రికా ఆటగాడు మక్రమ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. గాల్లో ఎగిరి బంతి అందుకున్నాడు. అన్రిచ్ నుంచి వచ్చిన బంతిని స్మిత్ ఫుల్ షాట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వైడ్ లాంగ్-ఆన్ వైపు వెళ్లింది. అక్కడే ఉన్న మక్రమ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. డైవింగ్ చేసి బంతిని అందుకున్నాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

Read Also..  Lalit Modi: బెట్టింగ్ కంపెనీలు కూడా ఐపీఎల్ జట్టును కొలుగోలు చేయవచ్చు.. లలిత్ మోడీ సంచలన ట్వీట్..