AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exam stress: ఫోకస్ పెట్టి చదవలేకపోతున్నారా? పరీక్షల టెన్షన్ ఎక్కువైపోతోందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

పరీక్షలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల ఏకాగ్రత చెదరకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. వారిలోని ఆందోళన స్థాయిలను తగ్గించడంతో పాటు ఒత్తిడి ఫీల్ అవ్వకుండా చూడాలి.

Exam stress: ఫోకస్ పెట్టి చదవలేకపోతున్నారా? పరీక్షల టెన్షన్ ఎక్కువైపోతోందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Exam Stress
Madhu
|

Updated on: Mar 01, 2023 | 2:25 PM

Share

విద్యార్థులకు ఇది పరీక్షా సమయం. అకడమిక్స్ సంబంధించిన పరీక్షలు ఒక ఎత్తు అయితే దాని ఫలితంగా వారు అనుభవించే ఒత్తిడి, మానసిక ఆందోళన మరో ఎత్తు. ఈ సమయంలో వారిలో ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ప్రశాంతత ఉండదు. అలాంటి సమయంలో వారు ఏకాగ్రత లేక ఇబ్బందులు పడతారు. అయితే పరీక్షలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల ఏకాగ్రత చెదరకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. వారిలోని ఆందోళన స్థాయిలను తగ్గించడంతో పాటు ఒత్తిడి ఫీల్ అవ్వకుండా చూడాలి. అప్పుడే వారిలో ప్రశాంతత వచ్చి పరీక్షలను బాగా రాయగలుగుతారు. అందుకే విద్యార్థులు వారి మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. నిపుణుల ద్వారా అందిస్తున్న ఈ సూచనలు రోజూ పిల్లల దినచర్యలో ఉండేలా చూసుకుంటే పరీక్షల సమయలో ఉపయుక్తంగా ఉంటాయి.

ధ్యాన సంగీతం.. మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి, పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి ధ్యాన సంగీతం ఒక అద్భుతమైన మార్గం. ధ్యాన సంగీతం ఒక ప్రశాంతత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు.. ఇది మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని సృష్టించి.. ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే పరీక్షల సమయంలో ధ్యాన సంగీతాన్ని వినడం వల్ల విద్యార్థి జ్ఞాపకశక్తిని పెంపొందుతుంది.

మైండ్ ఫుల్ నెస్.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గురించి మాత్రమే ఆలోచించాలి. అతిగా ఆలోచించుకొని మానసిక ప్రశాంతతను కోల్పోకూడదు. మనం ఎప్పుడూ అటెన్షన్లో ఉన్నప్పుడే మన ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తాయి. పరధ్యానంలో ఉండకూడదు. లేదా అనవసరపు ఆలోచనలు చేయకూడదు. ప్రస్తుత క్షణం గురించి మాత్రమే ఆలోచించాలి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన పద్ధతులు.. పరీక్షలు అభ్యాసకులకు ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లను అభ్యసించడం చాలా అవసరం. పరీక్షకు సన్నద్ధం అయ్యే టప్పుడు ఎక్కువ ఫోకస్డ్ గా ఉంటారు. ఇది సాధారణంగా అలసిపోయేలా చేస్తుంది. నిస్సత్తువ ఆవిరస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు పరీక్షల సమయంలో వ్యాయామం, యోగా, మంచి ఆహారం, సరైన నిద్ర సమయపాలన వంటి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించాలి. ఇశి ఒత్తిడిని తగ్గించడంలో, మనశ్శాంతిని పెంపొందించడంలో సహాయపడతాయి. తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుంది.

ప్రశాంతమైన మనస్సు.. ఆత్రుతతో కూడిన మనస్సు నిజమైన బాధను కలిగిస్తుంది. పరీక్ష సమయంలో ఇది విద్యార్థి మనశ్శాంతిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, అనుకూలమైన ఫలితాలను పొందడానికి కొన్ని వ్యాయామాలు చేయాలి. అలాగే ఎక్కువ గంటలు అదే పనిగా చదవకుండా.. మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఇబ్బందిగా ఉంటే స్నేహితులు, కుటుంబ సభ్యలు, నిపుణుల నుంచి సహాయం తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..