Workout Tips: విరామం లేకుండా వర్క్ అవుట్ చేశాడు.. గొంతులో బ్రెడ్ ముక్క ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు..
ఇటీవల 21 ఏళ్ల బాడీ బిల్డర్ భారీగా వర్క్ అవుట్స్ చేశాడు. అనంతరం బ్రేక్ సెషన్‌లో బ్రెడ్ తింటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కడలూరు జిల్లాలోని వడలూరులో చెందిన ఎం. హరిహరన్ బాడీ బిల్డింగ్ పోటీలకు ప్రిపేర్ అవుతున్నాడు.
ఈ మధ్య కాలంలో కొంత మంది ఎలా చనిపోతున్నారో? తెలియడం లేదు. మన ముందు చాలా చలాకీగా కనిపించే వారు చూస్తుండగానే చనిపోతుండడంతో ఎందుకు చనిపోతున్నారనే ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జిమ్ చేస్తూ చాలా ఫిట్‌గా ఉన్నవారే సడెన్‌గా కుప్ప కూలుతున్నారు. కన్నడ సినీ నటుడు పునీత్, ఏపీ మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లాంటి వారు వర్క్ అవుట్స్ చేస్తూ జిమ్‌లో కుప్పకూలిపోయిన వీడియోలు అప్పట్లో ట్రెండింగ్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. ఇటీవల 21 ఏళ్ల బాడీ బిల్డర్ భారీగా వర్క్ అవుట్స్ చేశాడు. అనంతరం బ్రేక్ సెషన్‌లో బ్రెడ్ తింటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కడలూరు జిల్లాలోని వడలూరులో చెందిన ఎం. హరిహరన్ బాడీ బిల్డింగ్ పోటీలకు ప్రిపేర్ అవుతున్నాడు. వెంటనే అతన్ని సమీప ఆస్పత్రికి తరలించేసరికి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్రెడ్ ముక్క అడ్డుపడేసరికి ఉక్కిరిబిక్కిరై చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వర్క్ అవుట్ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌గా ఉండాలని విశ్రాంతి లేకుండా వర్క్ అవుట్స్ చేయడం వల్ల చాలా అలసటకు గురై ప్రాణాల మీదకు వస్తుందని పేర్కొంటున్నారు.
వర్క్ అవుట్ సమయంలో జాగ్రత్తలు
వర్క్ అవుట్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణుల చెబుతున్నారు. ముఖ్యంగా చాలా అలసటకు గురవకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. వర్క్ అవుట్ సమయంలో చాలా హైడ్రేటెడ్‌గా ఉండడానికి ప్రయత్నించాలని పేర్కొంటున్నారు. వర్క్ అవుట్ సెషన్‌లో నీటిని తరచూగా కొంచెం కొంచెంగా సిప్ చేయాలని సూచిస్తున్నారు. వ్యాయామానికి ముందు భోజనం చేయడానికి, అరటిపండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పోస్ట్-వర్కౌట్ సెషన్ మీల్స్ కోసం, ఆమె గుడ్లు, ప్రొటీన్ బార్, పెరుగు, వేరుశెనగ, పండు, గింజలు, కాటేజ్ చీజ్‌తో కూడిన వెన్న కలిగి ఉన్న ఆహారం తీసుకోవాలని పేర్కొంటున్నారు. కొంతమందికి ద్రవం తీసుకోవడం లేదా ఆహారం చాలా వేగంగా తినడం చాలా హానికరమని చెబుతున్నారు. ఆహార పరిమాణం ఎక్కువగా తీసుకుంటే లేదా వ్యక్తి రిఫ్లెక్స్ వ్యవస్థ చాలా బలంగా లేకుంటే, ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. అందువల్ల తినేటప్పుడు లేదా తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. నెమ్మదిగా తినడం మరియు చిన్న ముక్కలుగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..