Dark Underarms : ఇక స్లీవ్ లెస్ దుస్తులంటే భయపడాల్సిన పనిలేదు! అమ్మాయిలూ.. ఈ టిప్స్‌తో ఆ సమస్య దూరం..
చంకల్లో నలుపును శాశ్వతంగా తొలగించే సింపుల్ చిట్కాలు.. అవి కూడా ఇంటి వద్ద దొరికే పదార్థాలతోనే చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పడు చూద్దాం..
చంకల్లో నలుపు సర్వసాధారణం. కానీ చాలా మంది ఆడపిల్లలు ఆ నలుపుని ఇష్టపడరు. ఎక్కువగా స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకోవాలనుకొనే వారు ఇబ్బంది పడుతుంటారు. నలుగురిలో అలాగే వెళ్తే అసహ్యంగా ఉంటుందన్న భావనలో వారు అవస్థలు పడతారు. చంకల్లో నలుపును ఏదో రకంగా తొలిగించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అయితే చికిత్సలు కూడా తీసుకుంటారు. అయితే చంకల్లో నలుపును శాశ్వతంగా తొలగించే సింపుల్ చిట్కాలు.. అవి కూడా ఇంటి వద్ద దొరికే పదార్థాలతోనే చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పడు చూద్దాం..
నిమ్మరసం.. నిమ్మకాయను సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ప్రతి రోజూ రెండు మూడు నిమిషాల పాటు స్నానం చేసే ముందు అర నిమ్మచెక్క తీసుకుని నల్లగా ఉన్న ప్రదేశంలో రుద్దాలి. ఆ రసాన్ని అలా 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేసి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
వంట సోడా.. ఇది అండర్ ఆర్మ్స్‌లోని నలుపుని దూరం చేసే ఉత్తమమైన హోం రెమిడీ. సహజమైన ఎక్స్‌ఫోలియంట్, ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది అండర్ ఆర్మ్ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను తగినంత నీటితో కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను మీ అండర్ ఆర్మ్స్‌కి అప్లై చేసి, నీటితో కడిగే ముందు కొన్ని నిమిషాల పాటు వృత్తాకారంగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేస్తే మార్పు కనిపిస్తుంది.
కొబ్బరి నూనె.. కొబ్బరి నూనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మానికి పోషణ, తేమను అందిస్తాయి. నిద్రపోయే ముందు మీ అండర్ ఆర్మ్స్‌కి కొద్ది మొత్తంలో కొబ్బరి నూనెను అప్లై చేసి, మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
దోసకాయ.. ఇది చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దోసకాయను మందపాటి ముక్కలుగా కట్ చేసి, వాటిని మీ అండర్ ఆర్మ్స్ మీద కొన్ని నిమిషాల పాటు రుద్దండి. అనంతరం దానిని 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదలేయండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
పసుపు.. దీనిలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ పసుపుని తగినంత నీటితో కలిపి, పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ అండర్ ఆర్మ్స్‌కు అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చంకల్లో నలుపు శాశ్వతంగా దూరం అవుతుంది.
కలబంద.. ఇది చర్మంపై చికాకు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కొద్ది మొత్తంలో అలోవెరా జెల్‌ను మీ అండర్ ఆర్మ్స్‌కు అప్లై చేసి, మసాజ్ చేసి, కొద్ది నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే గుణం కనిపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..