AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart-healthy Diet: ఇష్టమని వీటిని అదేపనిగా తిన్నారో.. మీ గుండె షెడ్డుకే!

జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వంటి వివిధ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. తాజా అధ్యయనాల ప్రకారం, మన దేశంలో మరణించే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలు ఉన్నాయని చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో గుండె జబ్బులు

Heart-healthy Diet: ఇష్టమని వీటిని అదేపనిగా తిన్నారో.. మీ గుండె షెడ్డుకే!
Heart Healthy
Srilakshmi C
| Edited By: |

Updated on: Jun 20, 2025 | 10:34 AM

Share

ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులు మరింతగా పెరుగుతున్నాయి . జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వంటి వివిధ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. తాజా అధ్యయనాల ప్రకారం, మన దేశంలో మరణించే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలు ఉన్నాయని చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో గుండె జబ్బులు ఉన్నవారిలో 40% మంది భారతీయులే కావడం ఆందోళనకరం. ఇటువంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆహారాలను పూర్తిగా నివారించడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఏ ఆహారాలు డేంజరో ఇక్కడ తెలుసుకుందాం..

ఫ్రెంచ్ ఫ్రైస్

వేడి నూనెలో వేయించిన బంగాళాదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. ఎందుకంటే ఇందులో ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి హానికరం. ఇష్టమని వీటిని అదే పనిగా తిన్నారో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఐస్ క్రీం

దాదాపు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. కానీ అతిగా తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో అధికమొత్తంలో సంతృప్త కొవ్వు, చక్కెర ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు పెరిగి, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

పిజ్జా

వీకెండ్‌ వచ్చిందంటే ఇంట్లో పిజ్జా పార్టీలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ అందులో ఉండే చీజ్, మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు కొవ్వు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాలను పదే పదే తీసుకోవడం ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు మంచిది కాదు. కాబట్టి, వాటిని అరుదుగా తినడం మంచిది.

సాఫ్ట్ డ్రింక్

సాధారణంగా మనం వేడి ఆహారాల కంటే చల్లని ఆహారాలను ఎక్కువగా ఇష్టపడతాం. శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. తరచుగా తాగే శీతల పానీయాలలో అధిక చక్కెర, కార్బోనేటేడ్ పదార్థాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేయడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో జీవక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి వీటిని తీసుకునే బదులు తాజా పండ్ల రసాలు, నిమ్మరసం తాగడం మంచిది.

ప్రాసెస్ చేసిన మాంసాలు

సాధారణంగా బేకన్, సాసేజ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు గుండెకు మంచివి కావు. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు వీటిని పూర్తిగా నివారించడం మంచిది.

చికెన్

చికెన్ ఆరోగ్యానికి మంచిది. అయితే, దానిని నూనెలో వేయించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా, రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. వేయించడానికి బదులుగా, దానిని గ్రిల్ చేయడం మంచిది. గుండె ఆరోగ్యం మన జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలలో ఒకటి. సరైన ఆహారంతో పాటు వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ వంటి అంశాలపై శ్రద్ధ చూపడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పైన పేర్కొన్న ఆహారాలను తీసుకోవడం తగ్గించడం లేదా పూర్తిగా నివారించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.