Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice bath Benefits: ఐస్ బాత్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. ఈ వయసువారు చేస్తే వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే..

స్నానం చేసే విధానంలో కూడా అనేక రకాలున్నాయి. స్టీమ్ బాత్, సాల్ట్ బాత్ , ఐస్ బాత్ వంటి రకరకాల స్నానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తరచుగా సినీ తారలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఐస్ బాత్ తీసుకుంటున్న చిత్రాలను షేర్ చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరికీ ఐస్ బాత్ అంటే ఏమిటి? ఈ విధానంలో స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఐస్ బాత్ వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Jun 20, 2025 | 9:45 AM

Share
సోషల్ మీడియాలో ఎవరైనా ఐస్ బాత్ చేస్తున్న ఫోటోను మీరు చూసి ఉంటారు. వాస్తవానికి. ఈ స్నానం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ ఐస్ బాత్ ని నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటారు. హెల్త్‌లైన్ ప్రకారం దీనిని క్రయోథెరపీ అని కూడా అంటారు. ఇందులో  10 నుంచి 15 నిమిషాలు పాటు అతి చల్లని లేదా మంచు నీటిలో స్నానం చేయాలి.

1 / 5
ఐస్ బాత్ తీసుకోవడం వల్ల శరీరానికి మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే అధికంగా వ్యాయామం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీర నొప్పి , కండరాల మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

2 / 5
ధర్మశిల నారాయణ హాస్పిటల్‌కు చెందిన వైద్యుడు గౌరవ్ జైన్ మాట్లాడుతూ  ఐస్ బాత్ వల్ల కలిగే ప్రయోజనాలు మీరు ఎందుకు చేస్తున్నారనే విషయంపై ఆధారపడి ఉంటాయి. ఇది కీళ్ళు, ఎముకలు , కండరాలలో మంటను తగ్గిస్తుంది కనుక ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాదు ఈ ఐస్ బాత్ శరీర కొవ్వును విచ్ఛిన్నం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

3 / 5
అయితే ఈ ఐస్ బాత్ ని 30 నుంచి 40 సంవత్సరాల వయస్సులో చేయవచ్చు. అయితే పెద్ద వయస్సు ఉన్న వారు ఈ ఐస్ బాత్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇది చర్మం, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, మెదడు సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక 40 ఏళ్లు దాటిన వారు ఈ ఐస్ బాత్ ని చేయడం ఆరోగ్యానికి హానికరం.

4 / 5
ఐస్ బాత్ నిపుణుడి సలహా , పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. అంతేకాదు ఐస్ బాత్ ప్రారంభంలో 1 నుంచి 2 నిమిషాలు మాత్రమే తీసుకోవాలి. ఆ తరువాత క్రమంగా స్నానం చేసే సమయం పెంచాలి. అలాగే దీనికి ముందు  శరీర ఉష్ణోగ్రతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. స్నానం చేయడానికి టబ్‌లోకి ప్రవేశించిన వెంటనే ఏదైనా సమస్య ఉంటే.. మీరు వెంటనే ఆపాలి.

5 / 5