మీకు ఆ సమస్యలు ఉంటే.. డైట్, ఉపవాసాలకు దూరంగా ఉండండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే!
మనలో చాలా మంది దేవుడి మొక్కు కోసం, లేదా బరువుతగ్గాలనే ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు. ఇందులో కొందరు వారంలో ఒకరోజు పాటించే వారు ఉంటారు. రోజూ పాటించేవారు ఉంటారు. కానీ ఇలా చేయడం సరికాదని వైద్యు నిపుణులు చెబుతున్నారు. మనం రోజంతా ఉపవాసం ఉండడం..16 గంటల పాటు ఆకలితో ఉండటం వల్ల మన గుండె బలహీనపడుతుందంటున్నారు. కాబట్టి మనం ఉపవాసాలను పాటిస్తూనే మన ఆరోగ్యం కూడా ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

బరువు తగ్గించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రజలు ఫిట్‌నెస్ ప్రపంచంలో కొత్త అలవాట్లను ఫాలో అవుతున్నారు. అందులో ఒకటి ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్. ఇది ఫాలో అయ్యేవారు రోజుకు 8 గంటలు మాత్రమే తింటూ మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉంటారు. అంటే 16:8 విధానం. కానీ ఇలా చేసే చేయడం ద్వారా మనకు గుండెసమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు ముందే గుండే సంబంధిత, లేదా ఇతర ఏదైనా వ్యాధులతో బాధపడుతుంటే.. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ కానీ, ఇతర ఏ ఉపవాసాలను కానీ ఫాలోకాకుండా.. వైద్యుల సలహామేరకు ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అవ్వడం మంచిది.
డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనే జర్నల్‌లో ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్‌పై పరిశోదన జరిపినట్టు ప్రస్తావించబడింది. ఈ పరిశోధన ప్రకారం, ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేసే విధానం గుండెకు ప్రాణాంతకం కావచ్చని పేర్కన బడింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్, కొన్ని ఇతర విశ్వవిద్యాలయాలు నిర్వహించిన ఒక అధ్యయనంలో 16:8 డైట్‌ను ఎక్కువ కాలం అనుసరించే వ్యక్తులకు గుండెపోటు, హృదయ సంబంధ మరణాల ప్రమాదం రెట్టింపు అవుతుందని కనుగొన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు లేదా మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారిపై ఇది ఎక్కవ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.
అసలు కారణం ఏమిటి?
శాస్త్రవేత్తలు ఈ సమస్య కేవలం “ఉపవాసం”లోనే కాదు, తినే విధానంలో కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎక్కువసేపు ఆకలితో ఉన్నప్పుడు, చాలా సార్లు వారు 8 గంటల వ్యవధిలో ఎక్కువ కేలరీలు, తక్కువ నాణ్యత గల ఆహారాన్ని తీసుకుంటారు. అంటే, ఆకలిని తీర్చడానికి జంక్ ఫుడ్ లేదా అధిక కేలరీల ఆహారం తీసుకోవడం పెరుగుతుంది. దీని కారణంగా దీర్ఘకాలిక ఆకలి ఒత్తిడి హార్మోన్లతో శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది భవిష్యత్తులో గుండెకు ప్రమాదకరంగా మారవచ్చు.
సురక్షితంగా ఉండటానికి ఏమి చేయాలి?
- వైద్యుడిని సంప్రదించండి – మీకు గుండె లేదా చక్కెర సంబంధిత సమస్యలు ఉంటే నిపుణుడిని అడగకుండా ఉపవాసం ప్రారంభించవద్దు.
- ఆహార నాణ్యత – మీరు 8 గంటల్లో ఏమి తిన్నా, అందులో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.
- ఎక్కువకాలం ఉపవాసం, డైట్‌ను ఫాలో అవ్వకండి – ఉపవాసాన్ని తాత్కాలిక సాధనంగా ఉపయోగించుకోండి (కొంతకాలం మాత్రమే దీనిని స్వీకరించండి), దీనిని జీవితకాల పరిష్కారంగా పరిగణించడం ప్రమాదకరం.
- మీ శరీరం చెప్పేది వినండి – ఉపవాసం ఉన్నప్పుడు మీకు తలతిరుగుతున్నట్లు, అలసట వచ్చినట్టు లేదా గుండె కొట్టుకోవడంలో తేదా అనిపిస్తే వెంటనే మీ డైట్, లేదా ఉపవాసాన్ని ఆపేయండి. తర్వాత వైద్యుడిని సంప్రదించండి.
(NOTE : పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివారాల ఆధారం అందించబడినవి.. కాబట్టి వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా.. ఇతర వైద్యులను సంప్రదించండి)




