AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యవ్వనానికి నెయ్యి.. 10 ఏళ్లు చిన్నవారిలా కనిపించడానికి ఈ ఒక్కటి చాలు..! రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోతారు..!

నెయ్యి మన వంటింట్లో ఎప్పుడూ ఉండేదే. కానీ దాని గొప్పతనం చాలా మందికి తెలియదు. కేవలం ఒక స్పూన్ నెయ్యి రోజూ తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా పెంచుతుంది. యవ్వనంగా కనిపించడానికి, ముడతలు పోగొట్టడానికి, చర్మాన్ని మెరిపించడానికి నెయ్యిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యవ్వనానికి నెయ్యి.. 10 ఏళ్లు చిన్నవారిలా కనిపించడానికి ఈ ఒక్కటి చాలు..! రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోతారు..!
Anti Aging
Prashanthi V
|

Updated on: Aug 25, 2025 | 4:13 PM

Share

ప్రతి రోజు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే అది మన ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెయ్యి ఎలా వాడితే మనం యవ్వనంగా, అందంగా కనిపిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిని మన వంటగదిలో చాలా కాలంగా వాడుతున్నారు. ఆయుర్వేదంలో దీనిని అమృతం అని కూడా పిలుస్తారు. ఖరీదైన మేకప్ వాడే బదులు.. రోజూ కాస్త నెయ్యి తీసుకుంటే చర్మం సహజంగా మెరుస్తూ మీరు వయసులో చిన్నవారిలా కనిపిస్తారు.

యవ్వనానికి నెయ్యి

  • చర్మం పొడిబారకుండా.. నెయ్యి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది, కాబట్టి చర్మం పొడిబారదు.
  • సహజ మెరుపు.. నెయ్యిని తరచుగా వాడితే ముఖంపై సహజమైన మెరుపు పెరుగుతుంది.
  • విషపదార్థాల తొలగింపు.. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను నెయ్యి తొలగిస్తుంది.
  • ముడతలు తగ్గిస్తుంది.. నెయ్యి వాడటం వల్ల ముఖంపై ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. దీని వల్ల మీరు మీ వయసుకంటే 10 ఏళ్లు చిన్నవారిలా కనిపిస్తారు.
  • చాలా మంది నెయ్యి తింటే లావు అవుతామని భయపడతారు. కానీ తగినంత మోతాదులో తీసుకుంటే బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉంటారు.

ఎలా తీసుకోవాలి..?

  • ఖాళీ కడుపుతో.. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
  • కాసేపు ఆగాలి.. నెయ్యి కలిపిన నీళ్లు తాగిన తర్వాత అరగంట వరకు ఏమీ తినకపోవడం మంచిది.
  • పసుపుతో.. ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు కలిపి తాగితే మరిన్ని లాభాలు ఉంటాయి.

నెయ్యిలోని పోషకాలు

  • నెయ్యిలో విటమిన్ A, D, E ఎక్కువగా ఉంటాయి.
  • చర్మం మెరిసేలా చేస్తాయి.
  • వయసు పెరిగినా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
  • జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.

ఇతర లాభాలు

  • జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.. నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
  • వ్యర్థాల తొలగింపు.. శరీరం నుంచి వ్యర్థాలు సులభంగా బయటికి పోతాయి.
  • నల్లటి వలయాలు తగ్గుతాయి.. ముఖంపై ఉండే నల్లటి వలయాలు, ముడతలు తగ్గుతాయి.
  • ముఖానికి మసాజ్.. నెయ్యితో ముఖానికి మసాజ్ చేస్తే పొడి చర్మం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
  • శక్తినిస్తుంది.. ఉదయం టీ లేదా కాఫీతో కలిపి తాగితే ఇది సహజమైన శక్తిని ఇచ్చే డ్రింక్ లా పని చేస్తుంది.

రోజు వారీ జీవితంలో సరైన మోతాదులో నెయ్యి వాడితే అది మీ ఆరోగ్యానికి, అందానికి, యవ్వనంగా ఉండటానికి ఒక సహజమైన వరంలా పనిచేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)