AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: టేబుల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ మధ్య తేడా ఏమిటి? ఏ ఉప్పుని ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు అంటే

మనమందరం ఉప్పును ఉపయోగిస్తాము. అయితే దీనిలో ఉన్న లెక్కలేనన్ని ప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలియదు. వైట్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్, సెల్టిక్ సముద్ర ఉప్పు, నల్ల ఉప్పు, ఫ్లేక్ సాల్ట్, కోషర్ ఉప్పు, పొగబెట్టిన ఉప్పు, హవాయి ఉప్పు వంటి మొత్తం 8 రకాల ఉప్పులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది రోజువారీ జీవితంలో టేబుల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ , పింక్ సాల్ట్ లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్య దృక్కోణం నుంచి చూస్తే ఏ ఉప్పు వలన ఎక్కువ ప్రయోజనమో ఈ రోజు తెలుసుకుందాం

Health Tips: టేబుల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ మధ్య తేడా ఏమిటి? ఏ ఉప్పుని ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు అంటే
Salth Benefits
Surya Kala
|

Updated on: Jul 18, 2024 | 7:57 AM

Share

షడ్రుచుల్లో ఒకటి ఉప్పు. ఇది ఆహార పదార్ధాల రుచిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఉప్పులు దొరుకుతుంది. అయితే చాలా ఇళ్లలో కేవలం తెల్ల ఉప్పును మాత్రమే వంటలకు ఉపయోగిస్తున్నారు. ఈ తెల్ల ఉప్పు మాత్రమే మార్కెట్‌లో ఎన్ని రకాల ఉప్పు దొరుకుతుందో తెలుసా. మార్కెట్‌లో లభించే ప్రతి ఉప్పు దాని సొంత ప్రయోజనాలు, లక్షణాలను కలిగి ఉంటుంది. వైట్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్, సెల్టిక్ సముద్ర ఉప్పు, నల్ల ఉప్పు, ఫ్లేక్ సాల్ట్, కోషర్ ఉప్పు, పొగబెట్టిన ఉప్పు, హవాయి ఉప్పు వంటి మొత్తం 8 రకాల ఉప్పులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది రోజువారీ జీవితంలో టేబుల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ , పింక్ సాల్ట్ లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్య దృక్కోణం నుంచి చూస్తే ఏ ఉప్పు వలన ఎక్కువ ప్రయోజనమో ఈ రోజు తెలుసుకుందాం

మనమందరం ఉప్పును ఉపయోగిస్తాము. అయితే దీనిలో ఉన్న లెక్కలేనన్ని ప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉప్పు ప్రయోజనాల గురించి .. వంట కోసం ఏ ఉప్పును ఉపయోగించడం మంచిదో ఈ రోజు తెలుసుకుందాం..

టేబుల్ సాల్ట్:

టేబుల్ సాల్ట్ చాలా తేలికగా లభించే ఉప్పు. సాధారణంగా అందరూ ఉపయోగించే ఉప్పు కూడా. ఇందులో ఎలాంటి మలినాలు ఉండవు. మెత్తగా నూరి కూడా ఉంటుంది. ఇది చాలా ప్రాసెసింగ్ తర్వాత తయారు చేయబడుతుంది. ఈ ఉప్పు కణికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండటానికి ఇదే కారణం. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే టేబుల్ సాల్ట్‌లో ఎక్కువ భాగం అయోడిన్‌తో శుద్ధి చేయబడుతోంది. ఇది థైరాయిడ్ వంటి సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అయోడిన్ పిల్లల మెరుగైన మెదడు పెరుగుదలకు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ఉప్పును అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

ఇవి కూడా చదవండి

నల్ల ఉప్పు:

దీనిని సాధారణ భాషలో నమక్ అని కూడా అంటారు. ఈ ఉప్పు తయారీలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, బొగ్గు, విత్తనాలు, చెట్ల బెరడును ఉపయోగిస్తారు. నల్ల ఉప్పును ఓవెన్‌లో ఎక్కువసేపు ఉంచి తయరు చేస్తారు కనుక ఈ ఉప్పుకి ఈ రంగు వస్తుంది. అంతేకాదు ఇది అపానవాయువు, మలబద్ధకం, అసిడిటీ వంటి అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

పింక్ సాల్ట్:

చాలా మందికి పింక్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ అని తెలుసు. ఈ ఉప్పును పాకిస్థాన్‌లోని హిమాలయాల ఒడ్డున తవ్వుతారు. ఈ ఉప్పు స్వచ్ఛమైన , ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇందులో 84 ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక శారీరక సమస్యల నుండి రక్షించబడతారు. రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ మీ బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఉప్పుతో తయారు చేసిన ఆహారం ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)