Jaganath Temple: 46 ఏళ్ల  ఉత్కంఠకు తెర.. తెరచుకున్న జగన్నాథ దేవాలయం నిధి.. రెండో రోజు రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు

జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో  కమిటీ సమక్షంలో  గది తలుపులు తెరిచారు. రహస్య గదిలోకి  వెళ్లిన వాళ్లు వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమ నిష్టలు పాటించారు. వీళ్లంతా సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు. మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి... ఆ తర్వాత రహస్య గదిలోకి వెళ్లారు.  అందరిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే  టెన్షన్‌. తలుపులు తెరవగానే ఓ ఘటన జరిగనే జరిగింది. ఎస్పీ పినాక్‌ మిశ్రాగదిలో సొమ్మసిల్లి పడిపోయారు . ఐతే ప్రాథమిక చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చారాయన  

Jaganath Temple: 46 ఏళ్ల  ఉత్కంఠకు తెర.. తెరచుకున్న జగన్నాథ దేవాలయం నిధి.. రెండో రోజు రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు
Jagannath Temple
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2024 | 8:20 AM

నిధి వందే జగద్గురుమ్‌. రత్నాభాండగారం  తలుపులు తెరుచుకున్నాయి. మరి రహస్య గదిలో ఏమున్నాయి? వాటి విలువెంత? మొదటి రోజు రత్న భండాగార తలుపులు తెరచుకున్నాయి. కౌంటింగ్‌ కాసేపే జరిగింది. నేడు రెండో రోజు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే పాత రికార్డులతో లెక్క సరితూగేనా? ఈ  లెక్క తేలడానికి  సమయం పడుతుంది. 46 ఏళ్ల  ఉత్కంఠకు తెరపడింది. ఇప్పుడు అందరి చూపు పూరీ వైపే.
పూరీ జగన్నాథుడి సన్నిధిలోని రత్నాభాండాగారంపై  ఇన్నాళ్ల మిస్టరీకి ఎట్టకేలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. 46 ఏళ్ల తరువాత  రత్నా భాండాగారం సీక్రెట్‌ రూమ్‌  తలుపుల్ని తెరిచారు. అమూల్యమైన బంగారు వెండి ఆభరణలు సహా,  స్వర్ణ, రత్న, వజ్ర ఖచిత వస్తువులతో  రహస్య నిధి జిగేల్మంది.  కమిటీ సమక్షంలో వాటిన్నంటిని చెక్క పెట్టేల్లో భద్రపరిచారు.  టైమ్‌ లేకపోవడంతో   ఆభరణాల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. రహస్య గదికి మళ్లీ తాళం వేశారు.  సోమవారం  కమిటీ సమక్షంలో నగల లెక్కింపు జరగనుంది.
టేకు చెక్కతో తయారు చేసిన పెట్టెలో భద్రపరచానున్నారు. వీటి లోపల లోహపు పొర ఉంటుంది. ఒడిశాలోని జగన్నాథ దేవాలయం రత్న భండాగారాన్ని తిరిగి తెరవడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్యానెల్‌కు జస్టిస్ విశ్వనాథ్ రథ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. రత్న భండాగారం తెరవడం గురించి సమాచారం ఇస్తూ.. “నిర్ణయించిన ప్రకారం మొదట రత్న భండాగారం తెరచారు.  ఆపై రెండు ‘భాండాగారాల్లో ఉంచిన నగలు, విలువైన వస్తువులను లోపల ముందుగా కేటాయించిన గదులకు తీసుకువెళతారు.
ఒడిశాలో బీజేపీ అధికారంలోకి  రాగానే  రత్నభాండాగారం తలుపుల్ని తెరుస్తామని  ఎన్నికల  ప్రచారంలో  ప్రధాని మోడీ  స్పష్టం చేశారు. ఆ మాటే బాటగా  తలుపులు తెరుచుకున్నాయి. ఐతే  గదిలో  నగలెన్ని ? వస్తువులెన్ని? రత్న, వజ్ర వైఢూర్యాలెన్ని? ఈ లెక్క తేలడం అంత ఆషామాషీ కాదు.  1978లో  వాటిన్నంటిని లెక్కించడానికి  72 రోజులకు పైగా సమయం పట్టింది. మరి ఈసారి ఎంత  టైమ్ పట్టే అవకాశం ఉందనేది  ఆసక్తికరంగా మారింది.
జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో  కమిటీ సమక్షంలో  గది తలుపులు తెరిచారు.  ఆలయ ఈవో  అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్‌ స్వైన్, పురావస్తుశాఖ ఇంజినీర్‌ ఎన్‌సీ పాల్‌, పూరీ రాజప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ సేవాయత్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రహస్య గదిలోకి  వెళ్లిన వాళ్లు వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమ నిష్టలు పాటించారు. వీళ్లంతా సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు. మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి… ఆ తర్వాత రహస్య గదిలోకి వెళ్లారు.  అందరిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే  టెన్షన్‌. తలుపులు తెరవగానే ఓ ఘటన జరిగనే జరిగింది. ఎస్పీ పినాక్‌ మిశ్రాగదిలో సొమ్మసిల్లి పడిపోయారు . ఐతే ప్రాథమిక చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చారాయన

ଜୟ ଜଗନ୍ନାଥ

ହେ ମହାପ୍ରଭୁ!

ତୁମେ ଲୀଳାମୟ। ତୁମ ଇଚ୍ଛାରେ ଏ ସାରା ସଂସାର ଆତଯାତ ହେଉଛି। ତୁମେ ଓଡ଼ିଆ ଜାତିର ହୃତ୍ ସ୍ପନ୍ଦନ। ଓଡ଼ିଆ ଜାତିର ଅସ୍ମିତା ଓ ସ୍ବାଭିମାନର ଶ୍ରେଷ୍ଠ ପରିଚୟ।

ఇవి కూడా చదవండి

ତୁମ ଇଚ୍ଛାରେ ଓଡ଼ିଆ ଜାତି ଆଜି ତାର ଅସ୍ମିତାର ପରିଚୟକୁ ନେଇ ଆଗକୁ ବଢ଼ିବାକୁ ଉଦ୍ୟମ ଆରମ୍ଭ କରିଛି। ତୁମ ଇଚ୍ଛାରେ ପ୍ରଥମେ ଶ୍ରୀମନ୍ଦିରର ଚାରି

— CMO Odisha (@CMO_Odisha) July 14, 2024

రత్నాభాండాగరంలో నగలు విలువైన వస్తువులకు సంబంధించి 1978 ఆడిట్‌ నిర్వహించారు. 128 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు…  221 కిలోలకు పైగా వెండి వస్తువులు ఉన్నట్లు తేల్చారు. ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్టు నివేదికలో ప్రస్తావించారు. ఆ తర్వాత 1982, 1985లో రహస్య గదులను తెరిచినా ఆభరణాల ఆడిట్‌ మాత్రం చేయలేకపోయారు.
దాదాపు అర్ధశతబ్దానికి పైగా  పూరీలోని రహస్య నిధిపై అనేక రకాలు చర్చలు జరిగాయి. తాళం చెవి మిస్సింగ్‌  మిస్టరీగా మారింది. రహస్య గదిని తెరిస్తే  అరిష్టం తప్పదనే వదంతులు షికారు చేశాయి.  మ్యాటర్‌ కోర్టుకు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో  ఎట్టకేలకు గది తలుపులు తెరవడానికి మార్గం సుగమైంది. కమిటీ ఆధ్వర్యంలో  రత్నాభాండాగారం  తెరుచుకుంది. ఇక నిధి విలువ  ఎంతో  లెక్క తేల్చడమే తరువాయి.
రత్నభాండాగారం అంటే ఏమిటి? జగన్నాథ దేవాలయం నాలుగు ధాములలో ఒకటి. దీనిని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో రత్నభాండాగారం కూడా ఉంది. రత్నభాండాగారాన్ని భగవంతుని నిధి అంటారు. ఈ రత్నభాండాగారంలో, జగన్నాథ ఆలయంలోని ముక్కోటి దేవతలైన జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర  ఆభరణాలు ఉంచబడ్డాయి. ఈ ఆభరణాలను ఎందరో రాజులు, భక్తులు భక్తిశ్రద్ధలతో ఎప్పటికప్పుడు దేవతలకు సమర్పించి రత్నాల దుకాణంలో భద్రపరిచారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..